Teach BJP a Lesson with voters: Harish Rao దుబ్బాక ఉపఎన్నిక: గెలుపు ఖాయమన్న కేసీఆర్..

Trs will win with huge majority in dubbaka bypoll says cm kcr

Dubbaka bypoll, CM KCR, victory in by-poll, Harish Rao, Finance Minister, opposition partiesm BJP President, Bandi Sanjay, Raghunandhan Rao, Telangana, politics

Telangana CM KCR said that the TRS will win with a huge majority in the Dubbaka by-election. He informed the media that the victory of the TRS in Dubbaka bypoll was already decided. Till the announcement of results, opposition parties will claim to win the by-election, he mentioned.

దుబ్బాక ఉపఎన్నిక: గెలుపు ఖాయమన్న కేసీఆర్.. బుద్దిచెప్పాలన్న హరీశ్

Posted: 10/29/2020 10:17 PM IST
Trs will win with huge majority in dubbaka bypoll says cm kcr

దుబ్బాక ఉపఎన్నిక ప్రచారానికి మరో మూడురోజుల వ్యవధిలో తెరపడనున్న తరుణంలో ఇక్కడ అధికార టీఆర్ఎస్.. దివంగత శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి  సతీమణి సోలిపేట సుజాతను బరిలోకి దింపగా బీజేపి తరుపున రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు పోటీచేస్తున్నారు. కాగా కాంగ్రెస్ తరుపున చెరుకు ముత్యం రెడ్డి తనయుడు బరిలో నిలివగా.. ప్రస్తుతానికి త్రిముఖ ఫోటీ నెలకొంది. కాగా, బీజేపి, టీఆర్ఎస్ ల మధ్య వాడీవేడిగా విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ గెలుపుకు మంత్రి హరీశ్ రావు, బీజేపి గెలుపుకు బండి సంజయ్ తమ భుజస్కందాలపై వేసుకుని శ్రమిస్తున్నారు.

కాగా ఇవాళ ధరణి పోర్టల్ ప్రారంభోత్సవం తరువాత దుబ్బాక ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఎన్నికలు తమకు ఒక లెక్కే కాదని అన్నారు. దుబ్బాక ఓటర్లు ఏ పార్టీకి ఓట్లు వేయాలో అన్నది ఎప్పుడో నిర్ణయించుకున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో చిల్లర తతంగాలు నడుస్తూనే ఉంటాయని... అలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. దుబ్బాకలో తమ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ విజయం ఇప్పటికే ఖరారుకాగా, ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతాన్ని ఓటర్లు నమ్మేస్థితిలో లేరని అన్నారు.

కేంద్రం విడుదల చేస్తున్న నిధులపై తెలంగాణ బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ తో తాను చర్చకు సిద్దమని.. సిద్దిపేటలో అయినా కరీంనగర్ లోనైనా రెడీ అంటూ సవాల్ చేసిన మంత్రి హరీశ్ రావు ఇవాళ బీజేపిపై మరింత దాడిని పెంచారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత తరఫున ప్రచారం నిర్వహిస్తున్న ఆయన కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. ఇప్పటివరకు వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు తీసుకురావడం తప్ప తెలంగాణ రైతాంగానికి బీజేపీ చేసిందేమీ లేదని మండిపడ్డారు.

వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించే బీజేపీకి ఓటేస్తారా? రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించే టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా? అని ప్రజలను ప్రశ్నించారు. వ్యవసాయ బావుల వద్ద మీటర్లు బిగిస్తున్న బీజేపీని 300 మీటర్ల లోతున పాతేయాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. బీజేపీ కుటిలయత్నాలకు ప్రజలు తమ ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక విధానాలను కొనసాగించే బీజేపి మనకు అవసరమా.? రైతాంగం కష్టాలు పడరాదని రైతు బంధు పథకం తెచ్చిన టీఆర్ఎస్ అవసరమా అన్నది ఓటర్లు తేల్చుకోవాలని కోరారు. దుబ్బాక ప్రజలు తెలివైన వారని ఈ ఎన్నికలలో బీజేపి గట్టి గుణపాఠం చెబుతారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles