Durga Matha as Gayatri Devi at Indrakeeladri ఇంద్రకీలాద్రిపై గాయత్రిదేవి అలంకరణలో దుర్గమ్మ దర్శనం..

Durga devi atop indrakeeladri attired as gayatri devi on third day of dasara celebrations

Kanaka durgadevi Temple, dasara celebrations, Gayatri Devi. durga devi, Dasara celebrations at Durga temple , Indrakeeladri, Dasara celebrations, 9 days Dasara celebrations, dasara navaratri, COVID-19, Coronavirus, Indrakeeladri, Vijayawada, Andhra Pradesh, Alampur, jogulamba Temple, Shaktipeetam, Mahaboobnagar, Telangana

The nine-day Dasara celebrations have begun at the Durga temple on Indrakeelthe hillock, on the third day of Navaratri celebrations today the Goddess Kanaka Durga will be attired as Gayatri Devi.

ఇంద్రకీలాద్రిపై గాయత్రిదేవి అలంకరణలో దుర్గమ్మ దర్శనం..

Posted: 10/19/2020 04:25 PM IST
Durga devi atop indrakeeladri attired as gayatri devi on third day of dasara celebrations

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలలో భక్తులు అత్యంత భక్తిప్రవర్తులతో పాల్గొంటున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలను ఆలయ కమిటీ అంగరంగవైభవంగా నిర్వహిస్తోంది, దేవీ శరన్నవరాత్రులలో మూడవ రోజైన ఇవాళ అమ్మవారు శ్రీగాయత్రీ దేవిగా భక్తులకు దర్శమిస్తున్నారు. గాయత్రి దేవి అలంకరాంలోని అమ్మవారి దర్శించుకుంటే కోరిన కోర్కెలు సత్వర ఫలిస్తాయని భక్తులు విశ్వాసం. ఆయురారోగ్యాలను, అపమృత్యుదోషాలను కూడా గాయత్రీ దేవి ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం, ఉత్సవాల మూడవ రోజు కావడంతో ఉదయం 3గంటలకు సుప్రభాత సేవతో ఆరంభించి నిత్యకైంకర్యాలను నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతించారు. 

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు, ముందుగా జారీ చేసిన టిక్కెట్లు ఉన్న వారిని మాత్రమే దర్శనాలకు అనుమతిస్తున్నారు. వేలాది మంది పోలీసులు ఉత్సవాల భద్రతలో పాల్గొంటున్నారు. ప్రతి గంటకు వెయ్యి మంది భక్తులు మాత్రమే అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు దుర్గగుడి ఆలయ నిర్వహకులు.. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఆర్జిత సేవలైన లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవావరణార్చన, చండీయాగాలను పరోక్ష భాగస్వామ్యంతో రుత్వికులు చేత నిర్వహిస్తున్నారు. 

ఇక కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఆలయ అధికారులు పలు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. భక్తులకు వ్యాధులు ప్రబలకుండా నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకునేలా ఆలయ కమిటీ చర్యలు తీసుకుంది, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు, ఇక ఇవాళ అమ్మవారికి ఏడువారాల వజ్రాల నగలను ఓ ఎన్నారై భక్తుడు సమర్పించారు, విజయవాడ వాస్తవ్యుడైన తాతినేని శ్రీనివాస్ దుర్గమ్మకు ఈ కానుకలను సమర్పించారు, అమ్మవారిని ఈ కానుకలను కూడా ఆలంకరించడంతో ఆయన భక్తిపారవశ్యం పోందారు. ఇక ఈ నగను ప్రతీ గురువారం అమ్మవారికి సమర్పిస్తామని ఆలయ ఈబో సురేశ్ బాబు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles