Tension arose at Nampally as Revanth Reddy arrested రేవంత్ రెడ్డి అరెస్ట్.. నాంపల్లిలో టెన్షన్..

Tension arose at nampally as revanth reddy arrested

Revanth Reddy, Malkajgiri MP, Gandhi Bhavan, BJP office, Nampally, GoshaMahal Police Station, HYderabad, Telangana, Rahul Gandhi, Hathras Rape Case, Hathras Rape, Rahul Gandhi pushing image, Hathras Rape Case, Rahul Gandhi Pushed by Cops, Greater Noida, Yamuna Express Highway, Uttar pradesh, Politics

Tension arose at Gandhi Bhavan and at BJP state Office in Nampally as Malkajgiri member of Parliament Revanth Reddy called for protest in front of BJP office. This call was given as Uttar Pradesh Police overaction made Rahul Gandhi fell down in a tussle. Revanth had been arrested.

రేవంత్ రెడ్డి అరెస్ట్.. నాంపల్లిలో టెన్షన్.. పలువురు కార్యకర్తలూ అదుపులోకి..

Posted: 10/01/2020 11:09 PM IST
Tension arose at nampally as revanth reddy arrested

(Image source from: Dailymotion.com)

దళిత యువతి సామూహిక అత్యాచారానికి గురైన ఉత్తర్ ప్రదేశ్ లోని హాత్రాస్ లో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన తమ పార్టీ అగ్రనేత, ఏఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని అక్కడి బీజేపి ప్రభుత్వం అడ్డుకుని పోలీసులతో తోసివేయించడంతో ఆయన కిందపడిన ఘటనపై మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ ఘటనను నిరసిస్తూ నాంపల్లిలోని రాష్ట్ర బీజేపి కార్యాలయం ఎదుల ధర్నా నిర్వహించేందుకు సన్నధమయ్యాడు. దీంతో ఉద్రిక్తతలు నెలకొంటాయని భావించిన పోలీసులు ముందుస్తుగా ఆయనను అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. గాంధీ భవన్ లోనే ఆయనను కట్టడి చేయాలని ప్రయత్నించారు.

పోలీసులను దాటుకుని రేవంత్ బీజేపి కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు యత్నించినా గాంధీ భవన్ బయట మోహరించిన పోలీసులు ఆయనను అడ్డకుని జీపులో ఎక్కించి గోషామహల్ పోలిస్ స్టేషన్ కు తరలించారు. అంతకుముందు కాంగ్రెస్ యువనేత అనీల్ కుమార్ యాదవ్ ను బీజేపి నేతలు అడ్డకుని దాడి చేశారని వార్త రేవంత్ కు తెలియడంతో ఆయన పోలీసులను దాటుకుని వెళ్లి నాంపల్లి రోడ్డుపై భైఠాయించి ధర్నాకు దిగారు, ఆయనకు పోటీగా బీజేపి శ్రేణులు కూడా ధర్నాకు దిగడంతో పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి గోషామహల్ పోలిస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో గాంధీ భవన్ ఆవరణలోకి చోచ్చుకోచ్చి.. అందోళనకు దిగిన బీజేపి కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలుసుకున్న బీజేపి కార్యకర్తలు.. పోలీసు వాహనాం వెంట కూడా పరుగులు తీసి టెన్షన్ పెట్టించారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు మోడీ దిష్టి బొమ్మ దహనానికి యత్నించగా, బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నాంపల్లిలోని రెండు జాతీయ పార్టీల కార్యాలయాల వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అలుముకుంది. రేవంత్ రెడ్డి పిలుపుతో ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున గాంధీ భవన్ కు తరలిరాగా, అటు బీజేపి కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో రాష్ట్ర కార్యలాయాలకు చేరుకున్నారు. ఇక ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ వాతావరణం అలుముకుంది. ఈ క్రమంలో అందోళనలకు దిగిన ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles