నవంబర్ రెండో వారం తరువాత ఎప్పుడైనా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగవచ్చునని.. అందుకు పార్టీ వర్గాలు సన్నధంగా ఉండాలని పిలుపునిచ్చారు రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సంకేతాలను ఆయన వెలువరించగానే రాష్ట్రంలోని విపక్ష రాజకీయ నేతలకు ఏదో సామెత గుర్తుకు వచ్చినట్లైయ్యింది. ఆవు, దూడ అన్న సామెతలను పక్కనబెడితే ఇవి గుర్తకు రావడానికి కారణమేంటంటే.. సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ జరిగిన ముందస్తు ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరగబోయేది ముందస్తుగానే చెప్పారు. దీంతో విపక్ష నేతలకు సామెతలను గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే మంత్రి కేటీఆర్ మాత్రం పక్కగా చెప్పకుండా ఫలానా నవంబర్ రెండో వారం తరువాత ఎప్పుడైనా గ్రేటర్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావచ్చునని చెప్పారు. ఇక రాష్ట్ర ఎన్నికల కమీషన్ మాత్రం జనవరి 15న కొత్త ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తామని చెప్పింది. నవంబర్ 16న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేస్తామని ప్రకటించింది. ఇక తమ ముసాయిదాపై అభ్యంతరాలు వుంటే డిసెంబర్ 12 వరకు వాటిని పరిష్కరించుకునే గడువు ఇస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానధికారి శశాంక్ గోయల్ వెల్లడించారు. అయితే జనవరి 15న కొత్త ఓటర్లు నమోదుతో పాటు డూప్లికేట్ ఓట్ల తొలగింపు ప్రకియను చేపట్టిన అనంతరం కొత్త ఓటర్లు తుది జాబితాను విడుదల చేస్తామని అన్నారు.
దీంతో జనవరి తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయని భావించిన రాజకీయ నాయకులకు ముందుగానే ఎన్నికలు పలకిరిస్తున్నాయగానే టెన్షన్ మొదలైంది. ఇక ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ కూడా గ్రేటర్ ఎన్నికల వ్యూహరచనలో మునిగిపోయాయి. ఓ వైపు బీజేపి ఎన్నికలలో తమ సత్తాను చాటాలని ఉవ్విళ్లూరుతుండగా, అటు కాంగ్రెస్ కూడా పూర్వవైభవం కోసం అస్త్రశస్త్రాలను సిద్దం చేస్తోంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టామని చెప్పగా.. వాటిని చూపించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సవాల్ చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు షెడ్యూల్ కంటే ముందు గానే జరుగుతాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం షెడ్యూల్ కంటే మూడు నెలల ముందు ఎన్నికలు జరుపుకునే వెసులుబాటు ఉంది.
దీనితో అధికార పార్టీ గ్రేటర్ ఎన్నికలకు ముందుగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు కూడా దీన్ని బలపరుస్తున్నాయి. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం నిర్వహించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి. రానున్న ఎన్నికల్లో అధునాత టెక్నాలజీ వినియోగిస్తామన్న ఆయన నామినేషన్ నుంచి ఫలితాల వరకు మొత్తం ప్రక్రియ ఆన్ లైన్‌లోనే నిర్వహిస్తామన్నారు. 150 పోలింగ్ కేంద్రాల్లో వార్డుకు ఒక ఫేస్ రికగ్నేషన్ యాప్ ను వాడతామని అలానే దివ్యాంగులకు పైలట్ ప్రాజెక్టు కింద ఈ ఓటింగ్ విధానం అమలు చేయబోతోందని చెప్పారు. ఈ ఓటింగ్ విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అన్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more