TDP leaders put under house arrest in Tirupati తిరుపతిలో టీడీపీ, బీజేపి నేతల హౌజ్ అరెస్ట్

Tdp leaders put under house arrest in tirupati as they tries to hold protest

TDP, Former MLA M Sugunamma, Pulivarthy Nani, Narasimha Yadav, TDP leaders, CM YS Jagan, Pattu Vasthrams, Garuda Seva, Bramhostavam, BJP, house arrest, Tirupati, protest, andhra pradesh news, Andhra Pradesh, Politics

AP police kept opposition TDP leaders under house arrest in Tirupati. Former MLA M Sugunamma planned a dharna at TTD adminstrative building to seek declaration from CM YS Jagan Mohan Reddy before his official visit to Tirumala temple for presentation of Pattu Vasthrams on the occasion of Garuda seva today.

సీఎం తిరుమల పర్యటన: తిరుపతిలో టీడీపీ నేతల హౌజ్ అరెస్ట్

Posted: 09/23/2020 06:09 PM IST
Tdp leaders put under house arrest in tirupati as they tries to hold protest

తిరుపతి టీడీపీ నేతలను పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా గృహనిర్భంధంలో వుంచారు. కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ గరుడ సేవను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించేందుకు వస్తున్నారు. దీంతో తిరుమల శ్రీవారి ఆలయ సంప్రదాయాలకు గౌరవమివ్వకుండా సీఎం జగన్ తిరుపతిలో పర్యటించడానికి వీల్లేదంటూ తిరుపతిలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో శ్రీవారి కోండపైకి సీఎం రాక సందర్భంగా తాను టీటీడీ పరిపాలన భవనం ఎదుట ధర్నాకు దిగుతానని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రకటించారు.

దీంతో అమె పిలుపును అందుకున్న టీటీడీ జిల్లా, తిరుపతి నగరం శాఖ కూడా సుగుణమ్మ ధర్నాలో భాగమయ్యేందుకు సిద్దమయ్యారు. అయితే టీటీడీ నేతల ధర్నాతో సీఎం పర్యటనలో ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ముఖ్యనేతల ఇళ్ల నుంచి బయటకు రాకుండా గృహనిర్భంధంలో వుంచారు. వీరితో పాటు అటు పలువురు బీజేపి నేతలను కూడా పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. అయినా పలువురు టీడీపీ నేతలు నగరంలోని తితిదే పరిపాలన భవనం సమీపంలోని వరదరాజ స్వామి ఆలయం వద్ద ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలిపారు. డిక్లరేషన్ పై సంతకం, దేవాలయాలపై జరుగుతున్న దాడులపై సీఎం స్పందించాలంటూనినాదాలు చేశారు.

జిల్లావ్యాప్తంగా పలువురు టీడీపీ సహా బీజేపి నేతలను పోలీసుల గృహ నిర్బంధం చేశారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటుగా చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహయాదవ్ తోపాటు బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్, జిల్లా కార్యదర్శి భాస్కర్, తిరుపతి నగర బీజేపి అధ్యక్షుడు వర ప్రసాద్ లతో పాటు పలువురు నాయకులను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ... తమ గొంతు వినిపించే కనీస హక్కు ఇవ్వకుండా ముఖ్యమంత్రి తమను గృహాల్లోనే బంధించడం సమంజసం కాదని అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని మండిపడ్డారు. సతీసమేతంగా ఇవ్వాల్సిన పట్టువస్త్రాలను సీఎం ఒక్కరే ఇవ్వటం రాష్ట్రానికి, దేశానికే అరిష్టమని తెలిసి ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. ఆలయ సంప్రదాయాలను గౌరవించకుండా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించటానికి సీఎం రావటం సరికాదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles