SP Balasubramaniam tests negative for COVID-19 ప్రముఖ సింగర్ ఎస్పీ బాలుకు కరోనా నెగిటివ్

Legendary singer sp balasubramaniam tests negative for covid 19 says his son spb charan

SP balasubramaniam hindi songs list, SP balasubramaniam, SP Sailaja, SP balasubramaniyaam songs list, SP balasubramaniam songs, Who is sp Balasubrahmanyam, SPB Breathless, spb ilaiyaraaja, spb ilayaraja controversy, Balu, Singer Balu, Who is SPB

In a major relief to fans and family, legendary singer SP Balasubramaniam has tested negative for the novel coronavirus. SP Charan, son of singer SP Balasubramaniam, in his statement said that his his father tested negative for novel coronavirus. However, the singer will have to be in hospital and will continue to be on ventilator support

ప్రముఖ సింగర్ ఎస్పీ బాలుకు కరోనా నెగిటివ్

Posted: 09/07/2020 08:49 PM IST
Legendary singer sp balasubramaniam tests negative for covid 19 says his son spb charan

(Image source from: Theweek.in)

కరోనా మహమ్మారి బారిన పడిన గానగంధర్వుడు ఎస్పీ బాలు ఆరోగ్య విషయంలో గత కొన్ని రోజులుగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇన్నాళ్లకు ఆసుపత్రి వర్గాలు శుభవార్తను అందించాయి. అయితే ఆసుపత్రి వర్గాలందించిన శుభవార్తను ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్సీ చరణ్ వెల్లడించారు. తాజాగా చేసిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ వచ్చింది. ఈ మేరకు ఇన్ స్టా వేదికగా వీడియోను పంచుకున్నారు. నాన్న ఆరోగ్యం గురించి వారాంతంలో అప్‌ డేట్‌ ఇవ్వకలేకపోయా క్షమించండి అని ఆయన పేర్కోన్నారు. దీంతో పాటు ఆయన ఇన్ స్టా లో పెట్టిన పోస్టు ఇలా సాగింది.

‘‘గతంతో పోలిస్తే, నాన్న ఊపిరితిత్తుల పనితీరు మెరుగవడంతో వెంటిలేటర్‌ తొలగిస్తారని మేము భావించాం. అయితే, ఊపిరితిత్తుల్లో ఇంకా ఇన్‌ఫెక్షన్‌ ఉండటంతో తీయలేదు. శుభవార్త ఏంటంటే, తాజాగా చేసిన పరీక్షల్లో నాన్నకు కరోనా నెగెటివ్‌ వచ్చింది. ఇక్కడ పాజిటివ్‌ లేదా నెగెటివ్‌ అన్నది సమస్య కాదు. నాన్న ఊపిరితిత్తులు త్వరగా మెరుగవ్వాలి. అయితే, ఇందుకు ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది.  వారాంతంలో అమ్మానాన్నల వివాహ వార్షికోత్సవం ఉండటంతో చిన్న సెలబ్రేషన్స్‌ చేశాం. నాన్న తన ఐపాడ్ లో క్రికెట్‌, టెన్నిస్‌ చూస్తున్నారు. ఐపీఎల్‌ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని చెప్పారు.

ప్రస్తుతం ఫిజియోథెరపీ కొనసాగుతోందని అన్నారు. బాలసుభ్రహ్మణ్యం కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలని చెప్పారు. మీ ప్రార్థనలు ఇలాగే కొనసాగాలని ఆయన అకాంక్షించారు. కరోనాతో పోరాడుతూ ఆగస్టు 5న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్యులు వెంటిలేటర్‌, ఎక్మోసాయంతో చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. తాజాగా ఆయనకు కరోనా నెగెటివ్‌ అని తేలడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకుని ఇంటికి రావాలని ఆకాంక్షిస్తున్నారు.

 
 
 
View this post on Instagram

A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) on

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles