Rise above the family: Sacked veterans to Sonia Gandhi 'కుటంబపరిధి దాటి అలోచన చేయండీ': అధినేత్రికి సీనియర్ల మరో లేఖ

Sonia gandhi rise above affinity for family say ousted up congress netas in dire warning

congress, sonia gandhi, rahul gandhi, santosh singh, gandhi family, expelled UP leaders, Satyadev Tripathi, uttar pradesh, National, politics

The leaders from Uttar Pradesh have asked Sonia Gandhi to 'rise above the affinity for the family (parivaar ke moh)' and run the organisation by establishing mutual trust and restoring the constitutional and democratic values.

‘‘కుటంబపరిధి దాటి అలోచన చేయండీ’’: అధినేత్రికి సీనియర్ల మరో లేఖ

Posted: 09/07/2020 01:44 PM IST
Sonia gandhi rise above affinity for family say ousted up congress netas in dire warning

కాంగ్రెస్ పార్టీని నడిపించేందుకు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన వ్యక్తినే అధ్యక్షుడిగా నియమించాలని, అతను పార్టీ వ్యవహారాల పట్ల క్రియాశీలకంగా వ్యవహరించాలని, పూర్తి కాలపు నాయకుడు కావాలంటూ 23 మంది సీనియర్లు లేఖ రాసి కాక పుట్టించిన కొన్ని రోజులకే బహిష్కృత నేతలు మరో లేఖ రాసి కాక పుట్టిస్తున్నారు. యూపీ కాంగ్రెస్ బహిష్కృత నేతలు ఈసారి నేరుగా సోనియా గాంధీనే టార్గెట్ చేస్తూ లేఖ రాశారు. ‘‘కుటుంబ అనుబంధాలను దాటి ఆలోచించండి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో మళ్లీ కాంగ్రెస్ లో అగ్గి రాజుకుంది. ఇప్పటికే ఈ లేఖను రాసిన వారిలో కొందిరిని పార్టీ నుంచి బహిష్కరించగా, మరికోందరిని క్రీయాశీలక వ్యవహారాలకు దూరంగా వుంచింది.

కాగా ఈ పర్యాయం ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియన్ నేతలు నేరుగా సోనియాగాంధీకి లేఖ రాశారు. ‘‘నెహ్రూ, ఇందిర, రాజీవ్ కాంగ్రెస్‌ను నిర్మించారు. దేశంలో ప్రజాస్వామ్య పునాదులు కూడా వేశారు. కానీ కొంత కాలంగా పార్టీని నడుపుతున్న విధానాన్ని చూస్తుంటే సాధారణ కార్యకర్తల్లో తీవ్ర గందరగోళాన్ని, నిరాశను కలిగిస్తోంది.’’ అంటూ బహిష్కృత నేతలు సంతోశ్ సింగ్, సత్యేదేవ్ త్రిపాఠి లేఖ రాశారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు, సామాజిక విలువలు తగ్గిపోతున్న ఇలాంటి సమయంలో దేశానికి కాంగ్రెస్ అవసరం ఎంతో ఉందని, కాంగ్రెస్ సజీవంగా, ధృఢంగా ఉండాలని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.

గాంధీ కుటుంబ కుటుంబ అనుబంధాల నుంచి దయచేసి బయటకు వచ్చి.. విభిన్నంగా,, పరిధి దాటి ఆలోచించాలని కోరారు. పార్టీ సంప్రదాయాలు, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ విలువలను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని.. పరస్పర విశ్వాసాలను పార్టీలో పెంచాలని కోరుతూ వారు లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో సోనియా గాంధీ కూడా వారికి గట్టిగానే జవాబిస్తూ వస్తున్నారు. ఇలాంటి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు పార్టీ అంతర్గత వేదికలపై మాట్లాడటం.. లేదా అధిష్టానం దృష్టికి వాటిని తీసుకురావడం మానేసి.. పార్టీ అధిష్టానానికి లేఖ రాయడం, వాటిని బహిర్గతం చేయడం ఓ జిమ్మిక్కుగా మారిందని ఇప్పటికే పార్టీ వర్గాలు లేఖలను తోసిపుచ్చుతున్నాయి.

ఈ క్రమంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డిన ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన పది మంది నేతలను అధిష్ఠానం బహిష్కరించింది. ఆ పది మందిలో సంతోశ్ సింగ్, సత్యేదేవ్ త్రిపాఠి నేతలు కూడా ఉన్నారు. ఇక యూపీ ఎన్నికలకు సమాయత్తమయ్యే నేపథ్యంలో అధిష్ఠానం ఏడు కమిటీలను వేసింది. సీనియర్ నేతలైన రాజ్ బబ్బర్, జితిన్ ప్రసాదతో పాటు మరి కొందరికి అధిష్ఠానం చోటు కల్పించలేదు. ‘క్రియాశీలక నేత, పూర్తికాలపు అధ్యక్షుడు’ కావాలంటూ లేఖ రాసి, సంతకాలు పెట్టిన వారిలో వీరిద్దరు కూడా ఉన్నారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా ఉన్న జితిన్ ప్రసాదకు, మొన్నటి వరకూ యూపీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రాజ్ బబ్బర్ కు ఏడు కమిటీల్లో ఏ ఒక్క కమిటీలో కూడా చోటు దక్కలేదు.

వీరితో పాటు మరో కేంద్ర సహాయ మాజీ మంత్రి, సీనియర్ నేత ఆర్.పి.ఎన్. సింగ్ కు కూడా ఏడు కమిటీల్లో ఏ ఒక్క కమిటీలో కూడా చోటు దక్కలేదు. అయితే యూపీ కాంగ్రెస్ నేతలు మాత్రం దీన్ని మరో కోణంలో ఆవిష్కరిస్తున్నారు. జితిన్ ప్రసాదపై అధిష్ఠానానికి ఏమాత్రం కోపం లేదని ఓ నేత తెలిపారు. జితిన్ ప్రసాదకు అధిష్ఠానం ఇప్పటికే ఓ పెద్ద బాధ్యత అప్పజెప్పింది. ‘బ్రాహ్మణ చేతన పరిషత్’ బాధ్యతలు అప్పజెప్పి... వారి ఓట్లను గంప గుత్తగా కాంగ్రెస్ పడే బాధ్యత ఆయకు అప్పజెప్పింది. ఆయనకు చేతి నిండా పని ఉంది’’ అని ఆ నేత పేర్కొన్నారు.

ఇక సీనియర్ నేత ఆర్.పి.ఎన్. సింగ్ విషయంలో కూడా ఈ కోణాన్నే పేర్కొంటున్నారు. ‘‘ఆర్.పి.ఎన్. సింగ్ జార్ఖండ్ ఇన్‌చార్జీగా ఉన్నారు. బిహార్ ఎన్నికల బాధ్యతలు కూడా ఉన్నాయి. అందుకే ఆయన్ను ఈ కమిటీల్లోకి తీసుకోలేదు’’ అని పేర్కొంటున్నారు. మరోవైపు అధిష్ఠానం మేనిఫెస్టో కమిటీని కూడా ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ నాయకత్వం వహిస్తారు. పి.ఎల్. పూనియా, సుప్రియా శ్రీనాతే, అర్ధానా మిశ్రా, ప్రమోద్ తివారీ, ఇమ్రాన్ మసూద్ తదితరులున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles