Liquor rates revised to combat smuggling in AP ఏపీలో మద్యం ధరల సవరణ..

Liquor rates revised to combat smuggling avoid sanitiser deaths in andhra pradesh

Liquor rates revised, consuming sanitizers, liquor smuggling, illicit liquor, Liquor mafia, Revenue Special Chief Secretary, Rajat Bhargava, CM Jagan, Andhra pradesh, Crime

Andhra Pradesh government on Thursday changed the rates of liquor in the state. The prices of liquor whose existing price are less than Rs 150 is reduced. The prices of liquor whose existing price is more than Rs 190 are increased. Prices of Beer and Ready to Drink are reduced by Rs 30.

చిన్నవాటిపై తగ్గిస్తూ.. పెద్దవాటిపై పెంచుతూ.. ధరల సవరణ

Posted: 09/04/2020 08:29 PM IST
Liquor rates revised to combat smuggling avoid sanitiser deaths in andhra pradesh

(Image source from: Manamnews.com)

మద్యానికి అలవాటు పడిన మందుబాబులు మద్యం కన్నా తక్కువ ధరకు లభించే సానిటైజర్లను సేవించి మత్తులో జోగడం.. దీంతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. మద్యం ధరలను సవరించింది. పేదలు, బడుగులు సేవించూ చిన్నబ్రాండ్ల మద్యం ధరలను తగ్గించిన ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రూ.120 ఉన్న క్వార్టర్‌ మద్యం ధరపై రూ.30, హాఫ్‌ బాటిల్ పై రూ.60 తగ్గించింది. రూ.120 నుంచి రూ.150 వరకు ఉన్న బ్రాండ్ల ధరల్లోనూ క్వార్టర్ పై రూ.70మేర కుదించింది.

అయితే క్వార్టర్‌ మద్యం రూ.150 నుంచి రూ.190 వరకు ఉన్న బ్రాండ్లపై ధరల జోలికి వెళ్లని ప్రభుత్వం వాటిని యథాతథంగా ఉంచింది. ఇక అంతకుమించిన పెద్దబ్రాండ్ల ధరను కూడా అమాంతం పెంచేసింది. క్వార్టర్‌ రూ.190 నుంచి 210 వరకు ఉన్న బ్రాండ్లపై ఏకంగా రూ.70మేర పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. క్వార్టర్‌ రూ.210కి పైగా ఉన్న బ్రాండ్లపై ధరను కూడా పెంచింది. దీంతోపాటు అన్ని రకాల బీర్లపై రూ.30, రెడీ టు డ్రింక్‌ మద్యంపై రూ.30 తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇవాల్టి నుంచే ఈ ధరలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ప్రభుత్వం రేట్లను సవరించడంతో ఇక మందుబాబులు ఆనందం వవ్యక్తం చేస్తున్నారు.

కాగా పెద్ద బ్రాండ్లు సేవించే మందుబాబులు మాత్రం ఇలా ప్రభుత్వం తమపై భారం మోపడాన్ని కూడా అదే మందుతో కలసి స్నేహితులతో పంచుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు తక్కువ బ్రాండ్‌ విలువ ఉన్న మద్యం ధరలను తగ్గించాలంటూ స్పెషల్‌ ఎన్ ఫోర్స్ మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలుచోట్ల శానిటైజర్లు, మిథైల్‌ ఆల్కహాల్‌ తాగి కొంతమంది మృతిచెందడం, మద్యం అక్రమ రవాణా నేపథ్యంలో ఎస్‌ఈబీ పలు సూచనలతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా తాజాగా కొన్ని రకాల మద్యంపై ధరలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles