Andhra govt moves SC against HC order on scrapping EM in schools సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ కు మరో ఎదరుదెబ్బ..

Andhra pradesh defends decision to change medium of instruction in government schools to english

Telugu medium schools, supreme court news, supreme court on english medium school case, Srinivas Guntipalli, Andhra Pradesh govt schools, Justice D Y Chandrachud, Justice Indu Malhotra, Justice K M Joseph, AP High Court

The Supreme Court issued a notice on Andhra Pradesh government's plea seeking to make English the medium of education from class one to six in its schools. A bench comprising Justices D Y Chandrachud, Indu Malhotra and K M Joseph sought response of Srinivas Guntipalli on whose plea the Andhra Pradesh High Court had stopped the implementation of the plan in government-run Telugu medium schools.

సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ కు మరో ఎదరుదెబ్బ.. ఆంగ్లబోధనపై స్టేకు నిరాకరణ

Posted: 09/03/2020 08:52 PM IST
Andhra pradesh defends decision to change medium of instruction in government schools to english

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు ప్రజల్లో తమదైన ముద్ర వేసుకునేందుకు ప్రవేశపెడుతున్న పలు విధానాలు, పథకాలు వివాదాస్పదమై న్యాయస్థానాలో విచారణ సాగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రభుత్వం ప్రబుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయం కూడా వివాదాస్పదమైంది. ప్రభుత్వం తీసుకొచ్చిన 81, 85 జీవోలను ఏపీ హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసి హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కోరింది.

అయితే ఈ పిటీషన్ ను విచారణించిన న్యాయస్థానం రాష్ట్రోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విదింపుకు నిరాకరించింది. దీంతో సర్వోన్నత న్యాయస్థానం తమ వినతిని తిరస్కరించడంతో ప్రభుత్వానికి మరోమారు ఎదురుదెబ్బ ఎదురైంది. ఏపీ ప్రభుత్వం తరపున కోయంబత్తూర్ కు చెందిన సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ వాదనలు వినిపించారు. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్లమాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను రద్దు చేయడం సరికాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని విద్యాహక్కు చట్టంలో లేదని ఆయన కోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వ ప్రగతిశీల నిర్ణయం తీసుకుందని వాదించారు. తెలుగులో బోధన వల్ల పాఠశాలల్లో నమోదు తగ్గిపోతోందని కోర్టుకు వివరించారు.

దీనిపై స్పందించిన జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ కెఎం జోసెఫ్ లతో కూడాని త్రిసభ్య ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు ఇస్తామని చెప్పింది. నోటీసులతో స్టే కూడా ఇవ్వాలని విశ్వనాథన్‌ ధర్మాసనాన్ని కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లిష్‌ మీడియంలో బోధననే కోరుతున్నారని ఏపీ సర్కారు వాదించింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం కోరింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. కేవియట్ వేసిన విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రొఫెసర్లు రెండు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles