Pranab Mukherjee passes away at 84 మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇకలేరు..

Pranab mukherjee former president of india dies at 84

pranab mukherjee death,Breaking news pranab mukherjee death,Pranab Mukherjee news,Pranab Mukherjee, Covid-19 positive,Former President Pranab Mukherjee death, Pranab Mukherjee,pranab mukherjee biography, what happened to pranab mukherjee,present president of india, pranab mukherjee twitter,pranab mukherjee death date

Pranab Mukherjee, former President of India and stalwart of Indian politics, breathed his last on Monday (August 31). He was 84. The information was announced by his son Abhijit Mukherjee. The information was announced by his son Abhijit Mukherjee.

మాజీ రాష్ట్రపతి, రాజకీయ కోవిదుడు ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత..

Posted: 08/31/2020 06:09 PM IST
Pranab mukherjee former president of india dies at 84

మాజీ రాష్ట్రపతి, రాజకీయ కోవిదుడు ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూశారు. అనారోగ్యంతో గత ఇరవై రోజలుగా ఆయన ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలోని ఆర్మీ రిసర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలోనే చికిత్స పోందుతు ఇవాళ తుదిశ్వాస విడిచారు, ఆయన తనయుడు అభిజిత్  ముఖర్జీ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ తన సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇవాళ ఉదయం అర్మీ అసుపత్రి అధికార వర్గాలు వెల్లఢించిన హెల్త్ బులిటెన్ లో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని.. ఆదివారం రాత్రి నుంచి ఆయన ‘సెప్టిక్ షాక్’ స్థితిలోకి జారుకున్నారని పేర్కోన్నాయి, వెంటిలేటర్‌ సహాయంతో చికిత్స కొనసాతున్న క్రమంలోనే ఆయన మరణించారు.

ఐదు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న రాజకీయ కోవిదుడిగా ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రజలకు సుపరిచితుడే. ఇక కాంగ్రెస్ నేతగా ఆ పార్టీలో వివిధ పదవులను అధిరోహించిన ఆయన పార్టీలో ట్రబుల్ షూటర్ గా కూడా పేరోందారు. పార్టీలో ఏక్కడ ఏ సమస్య వచ్చినా ఆయన దానిని చాకచక్యంగా పరిష్కరించేవారు. దీంతో ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రపతిని బరిలో నిలిపి మరీ గెలిపించింది. కాగా, ఎనభై నాలుగేళ్లు ఈ సీనియర్ రాజకీయ వేత్త, ఈ నెల 10వ తేదీని బ్రెయిన్ లో రక్తం గడ్డకట్టడంతో దానికి శస్త్ర చికిత్స చేయించుకునే విషయమై ఆర్మీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే సర్జరీ చేసే క్రమంలో ఆయనకు నిర్వహించిన పలు విధాల పరీక్షలలో ఆయనకు కరోనా సోకిందని కూడా నిర్థారణ అయ్యింది.

అయినా వైద్యులు ఆయనకు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిన ఆయన భాధను అనుభవిస్తున్న తరుణంలో శస్త్రచికిత్స చేశారు. దీంతో సర్జరీ తరువాత ఆయన ఆరోగ్యం విషమంగా మారిడంతో ఆయన కోమాలోకి జారుకున్నారు. అయితే అప్పటి నుంచి ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. సర్జరీ నుంచి వెంటిలేటర్ ను సాయంతోనే ఆయన శ్వాస తీసుకుంటున్నారని అసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా ఆయన ఆసుపత్రిలో చేరిన తరువాత తనకు కరోనా సోకిందని తెలిసి.. గత రెండు వారాలుగా తనను కలసిన వారందరూ తప్పక కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అదే ఆయన చేసిన ఆఖరు ట్వీట్ గా నిలిచింది. అంపశయ్యపైకి వెళ్తూ కూడా ఆయన తన మూలంగా ఇతరులు బాధపడరాదని పరీక్షలు చేయించుకోమని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles