Pawan kalyan slams government over ruling party attacks దిశ చట్టంపై జగన్ సర్కార్ ను టార్గెట్ చేసిన పవన్

Pawan kalyan slams government over attacks on janasena and bjp activists

Janasena, Pawan Kalyan,YSRCP party, JanaSena activists, BJP activists, Uttarandhra, Srikakulam, vizianagaram, visakhapatnam, Andhra Pradesh, politics, Crime

JanaSena president pawan kalyan slams government over Ruling YSRCP party attacks on Janasena and BJP activists, who therein stand with the women in uttarandhra region. Questions why does the govt and police not taken action against the accused.

అధికార పార్టీ ఆగడాలపై చర్యలుండవా,? చట్టం వర్తించదా.?: పవన్ కల్యాణ్

Posted: 08/28/2020 08:38 PM IST
Pawan kalyan slams government over attacks on janasena and bjp activists

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ప్రభుత్వాలు చేసే తప్పులను ప్రశ్నిస్తూనే వుంటానని నినదించిన ఆయన.. అదే ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టంపై ప్రభుత్వంపై మండిపడ్డారు. మహిళల కోసం ప్రత్యేకంగా దిశ చట్టాన్ని తీసుకువచ్చామని చెబుతూనే.. వారికి అండగా నిలబడినందుకు తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగబడతారా.? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో మహిళలకు అండగా నిలచిన జనసేన, బీజేపీ కార్యకర్తలపై అధికార పార్టీ శక్తులు దౌర్జన్యానికి పాల్పడ్డాయని మండిపడ్డారు. వరుసగా దాడులలో వారు చెలరేగిపోతున్నా.. ప్రభుత్వం, చట్టం చోద్యం చూస్తోందా.? అని నిలదీశారు.

ప్రజా గళం వినిపిస్తూ, బాధితులకు బాసటగా నిలబడటమే జనసేన విధానమని మరోమారు బాహాటంగా వ్యక్తం చేసిన ఆయన ఈ మేరకు ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. అధికార పార్టీకి చెందిన అరాచక శక్తులు శాంతిభద్రతలకు విఘ్నం కలిగిస్తున్నా.. ప్రశాంతతకు భగ్నం కలిగిస్తున్నా వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదా.? చట్టం అధికార పార్టీ అరాచక శక్తులకు కొమ్ముకాస్తుందా.? అంటూ ప్రశ్నించారు. బాధితుల పక్షాల నిలుస్తున్న తమ పార్టీ కార్యకర్తలకు వర్తించే చట్టం వారికి ఎందుకు వర్తించదని ఆయన ప్రశ్నించారు. జనసేన శ్రేణులపై అధికార పక్షం దాడులకు తెగబడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అప్రజాస్వామికం అన్నారు పవన్.

విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలోని నిడిగట్టు పంచాయతీ నేరెళ్ళవలసకు చెందిన జనసేన కార్యకర్త మూగి ప్రసాద్‌, బీజేపీ కార్యకర్త మూగి శ్రీనివాస్‌ లపై వైఎస్సార్‌సీపీ నాయకుడు ఊళ్ళ చిన్నా హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. బాధితులు తీవ్ర గాయాలతో కేజీహెచ్‌ లో చికిత్స పొందుతున్నారని.. దాడి అంశాన్ని జనసేన నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ ఘటన విషయంలో భీమిలి పోలీసులు ఆనుసరిస్తున్న విధానం, కేసులు నమోదు చేసిన తీరు అన్యాయంగా ఉందన్నారు. హత్య చేసేందుకు ప్రయత్నించిన అధికార పక్ష నేతను అరెస్ట్ చేయకుండా బాధితుల పక్షాన నిలిచిన వారిని రాత్రికి రాత్రి అరెస్ట్‌ చేయడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.

వాలంటీర్‌గా పనిచేస్తున్న వివాహితపై అధికార అధికార పార్టీ నాయకుడు లైంగిక వేధింపులకు పాల్పడితే మందలించినందుకు మూగి ప్రసాద్‌, మూగి శ్రీనివాస్‌ లపై కత్తితో దాడికి తెగబడ్డారని ఆరోపించారు. వాలంటీర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిపై నిర్భయ కేసు నమోదు చేయాలిని డిమాండ్ చేశారు. మహిళలను కాపాడతామని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన దిశ చట్టం ఏమైంది.. నడిరోడ్డుపై హత్యయత్నానికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్ట్‌ చేయకుండా ఉండటం వెనక ఎవరి ఒత్తిళ్ళు ఉన్నాయో భీమిలి ప్రాంత ప్రజలకు అర్ధం అవుతోంది అన్నారు. విజయనగరంలో బీజేపీ నాయకుడిపై అధికార పక్ష గూండాలు హత్యాయత్నానికి తెగబడ్డారు. ఇప్పుడు భీమిలి నియోజకవర్గం పరిధిలో జనసేన, బీజీపీ కార్యకర్తలపై హత్యాయత్నానికి దిగారని మండిపడ్డారు. రాష్ట్ర డీజీపీ తక్షణం స్పందించి నిందితుడిని తక్షణమే అరెస్ట్‌ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన, హత్యాయత్నంపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles