Hyderabad roads riddled with 3,000 potholes అంతర్జాతీయ నగర రోడ్లపై అడుగడుగునా గుంతలే..

Hyderabad roads riddled with 3000 potholes

Hyderabad roads, potholes, Hyderabad traffic, Hyderabad rains, International city hyderabad, hyderabad road patholes, GHMC, Traffic, motorists, citizens

Over 3,000 potholes and craters were formed on roads owing to relentless rains in the Greater Hyderabad limits in the past four days. This is causing inconvenience to motorists and citizens. GHMC identified about 3,067 potholes on city roads, including those under the Comprehensive Road Maintenance Programme (CRMP), across all the six zones of the civic body.

వరుణుడి బీభత్సంతో.. గోతులమయమైన హైదరాబాద్ నగర రోడ్లు..

Posted: 08/20/2020 08:17 PM IST
Hyderabad roads riddled with 3000 potholes

అంతర్జాతీయ గుర్తింపు పోందిన హైదరాబాద్ నగరం మరోమారు వార్తల్లో నిలుస్తోంది. అయితే అంతర్జాతీయ ఖ్యాతి పోందిన ఈ నగరంలో గత వారం రోజులుగా కురిసిన వర్షంతో అటు నగరం నడిబోడ్డున వున్న హుస్సేన్ సాగర్ నిండికుండలా మారడంతో గేట్టు ఎత్తివేసి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు అధికారు. దీంతో హుస్సేస్ సాగర్ లొతట్టు ప్రాంతాల ప్రజలు అందోళనలు దూరమయ్యాయి. అయితే ఇందుకోసం హైదరాబాద్ వార్తల్లో నిలిచిందా.? అని భావిస్తున్నారా.? కానీ కాదు. చెన్నై తరువాత కేరళలో బీభత్సం సృష్టించిన వరుణుడు హైదరాబాద్ నగరంపై కూడా పగబట్టాడా.? అన్న రితీలో ప్రతీరోజు వర్షాన్ని కురిపిస్తున్నాడు.

అయితే గత వారం రోజులుగా ప్రతీరోజు వర్షం కురుస్తుండటంతో అంతర్జాతీయ నగర రోడ్డు పూర్తిగా గోతులమయంగా మారిపోయాయి. దీంతోనే ఇప్పుడు హైదరాబాద్ నగరం వార్తల్లో నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం సహా గ్రేటర్ హైదరాబాద్ పురపాలక సంస్థ ఎందుకు చేపట్టడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వారం రోజుల వరుస వర్షాలకే రోడ్డు అడుగడుగునా గుంతలు పడటంతో పాటు కంకర తేలడం, రోడ్డుపక్కనున్న ఫుట్ పాత్ లపై నుంచి వెళ్తామన్నా.. అక్కడ కూడా ఇసుక మేటలు, గోతులు ఏర్పడి వాహనదారులకు డ్రైవింగ్ కు పరీక్ష పెడుతున్నాయి. ఏ మాత్రం ఏమరపాటుగా ముందుకు వెళ్లినా.. గాయాలపాలు కావడం గ్యారంటీ అన్నట్లుగా తయరయ్యాయి.

అయితే ఇలా గోతులమయమైన రోడ్లను గుర్తించింది జీహెచ్ఎంసీ. ఈ నెల 14 నుంచి 17 వరకు ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరంలోని రోడ్లపై ఏకంగా 3067 గుంతలుపడ్డాయని లెక్కగట్టింది. వాటిలో శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన రోడ్లపైనే అధికంగా ఏకంగా 687 గుంతులు పడ్డాయని కాంప్రహెన్సివ్ రోడ్డు మెయిన్ టేనెన్స్ ప్రాగ్రామ్ (సీఆర్ఎంపీ) గుర్తించింది. ఆ తరువాత ఎల్బీనగర్ జోన్ పరిధిలో 680, ఖైరతాబాద్ జోన్ పరిధిలో 538, సికింద్రాబాద్ జోన్ పరిధిలో 492 గుంతలు పడ్డాయని గుర్తించింది. ఇక గత రెండు రోజులుగా ఈ గోతులను పూడ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టింది జీహెచ్ఎంసీ, ఇప్పటికే దాదాపు యాభై శాతం మేర మరమ్మత్తులను పూర్తి చేసిన జీహెచ్ఎంసీ.. మరో రెండు మూడు రోజుల పాటు మిగిలిన రోడ్లకు కూడా మరమ్మతులు చేపడతామని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles