Congress leader Rajiv Tyagi dies after cardiac arrest కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హఠాన్మరణం

Congress leader and spokesperson rajiv tyagi dies after heart attack

Rajiv Tyagi, Congress, cardiac arrest, UPCC general secretary, Rahul Gandhi, Priyanka Gandhi, Sonia Gandhi, spokesperson, Ghaziabad, Uttar Pradesh

Congress leader Rajiv Tyagi died on Wednesday due to cardiac arrest. Tyagi was party's general secretary and spokesperson for its Uttar Pradesh unit. Tyagi died in Ghaziabad.

హఠాన్మరణానికి గురైన కాంగ్రెస్ సీనియర్ నేత..

Posted: 08/12/2020 11:53 PM IST
Congress leader and spokesperson rajiv tyagi dies after heart attack

(Image source from: Oneindia.com)

కాంగ్రెస్ సీనియర్‌ నేత ఆకస్మికంగా మరణించారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి హఠాన్మరణం చెందారు. ఘజియాబాద్‌లోని తన నివాసంలో ఇవాళ ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. రాజీవ్ త్యాగి మ‌ర‌ణించాడ‌ని కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో ప్రకటించింది. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. రాజీవ్ త్యాగి హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొంది. నిజమైన దేశభక్తుడు, బలమైన నేతను కోల్పోయామని తెలిపింది. త్యాగి కుటుంబ‌స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని వెల్లడించింది.

కాగా, ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఆజ్‌తక్‌ వార్తా చానెల్లో తాను డిబేట్లో పాల్గొంటున్నానని త్యాగి కొన్ని గంటల కిత్రం ట్వీట్‌ చేశారు. అంతలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఇదిలాఉండగా.. గత అక్టోబర్‌ నెలలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆయనను ఉత్తర ప్రదేశ్‌లో మీడియా ఇన్‌చార్జిగా నియమించారు. త్యాగి కాంగ్రెస్ జాతీయ ప్రతినిధిగా, పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న కీల‌కంగా ప‌నిచేశారు. త్యాగి మృతి పట్ల కాంగ్రెస్‌ కీలక నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, అధ్యక్షురాలు సోనియా గాంధీ , రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌, బీజేపీ నేత సబిత్‌ పాత్రా, ఎన్సీపీ నేత నవాబ్‌మాలిక్‌ ట్విటర్‌ వేదికగా సంతాపం ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles