Schools, colleges to be shut till 31 August కర్ప్యూ ఎత్తివేత.. విద్యాసంస్థలు, బార్లపై నిషేధం..

Unlock 3 guidelines schools colleges to be shut till 31 august gyms can open

MHA guidelines, MHA, lockdown extension, coronavirus, covid-19, night curfew, gymns, Unlock 3.0 Lockdown, containment zones

The Ministry of Home Affairs issued fresh guidlines under its Unlock 3 plans to relax the lockdown restrictions in areas outside containment zones amid the novel coronavirus outbreak. The guidlines will come into effect from 1 August, 2020.

అన్ లాక్ 3.0: కర్ప్యూ ఎత్తివేత.. విద్యాసంస్థలు, బార్లపై నిషేధం..

Posted: 07/29/2020 11:24 PM IST
Unlock 3 guidelines schools colleges to be shut till 31 august gyms can open

కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో పాటు జిమ్‌లు, యోగా కేంద్రాలకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. అయితే, స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు తెరవడంపై ఉన్న నిషేధం కొనసాగుతుందని స్పష్టంచేసింది. ఈ మేరకు కంటైన్మెంట్ జోన్ల బయట కార్యకలాపాలకు సంబంధించి మరిన్ని సడలింపులతో కూడిన అన్ లాక్‌ 3.0 మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ బుధవారం జారీ చేసింది. ఆగస్టు 1 నుంచి ఈ మార్గదర్శకాలు అమలు కానున్నాయి.

లాక్ డౌన్‌ ప్రారంభం నుంచి దేశంలో కొనసాగిస్తున్న రాత్రి వేళ కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. జిమ్ లు, యోగా కేంద్రాలు ఆగస్టు 5 నుంచి తెరుచుకోవచ్చని తెలిపింది. భౌతిక దూరం పాటిస్తూ స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. ఎట్‌ హోం కార్యక్రమాలపై రాష్ట్రపతి, గవర్నర్లు నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది.

స్కూళ్లు, కళాశాలలు, కోచింగ్‌ కేంద్రాలను ఇప్పుడే తెరిచేది లేదని కేంద్రం మరోసారి స్పష్టంచేసింది. ఆగస్టు 31 వరకు వీటిపై ఉన్న నిషేధం యథాతథంగా అమలౌతుందని తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు, బార్లు, ఆడిటోరియాలు వంటివి తెరవడంపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం స్పష్టంచేసింది. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, మతపరమైన కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం స్పష్టంచేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో మాత్రం ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని స్పష్టచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles