Five key RTA services go online వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆ సేవలన్నీ ఆన్ లైన్లోనే.!

Telangana transport department has made key rta services go online

Department of Transport, Telangana, Online, Mantri Puvada, Licenses, Online Services, RTA Office, Driving License, RTA services, RTA offices, Online, Hyderabad, Hyderabad News, Telangana, Telangana News

Now citizens can get a duplicate learners licence, duplicate driving licence, badges and new smart card licence (in place of old licence) without visiting the RTA offices. Transport Minister P Ajay launched the five online services, which include the facilities mentioned above.

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆ సేవలన్నీ ఆన్ లైన్లోనే.!

Posted: 07/25/2020 07:33 PM IST
Telangana transport department has made key rta services go online

దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రవాణా శాఖ తీసుకున్న కీలక నిర్ణయం వల్ల వాహనదారులకు తిప్పలు తప్పనున్నాయి. వాస్తవానికి వాహనదారులు లైసెన్స్ తీసుకోవాలన్నా.. రెన్యూవల్ చేసుకోవాలన్నా.. వాహనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా.. వారు పడే ఇబ్బందులు అన్నీఇన్నీకావు. వీటిని తీసుకునేందుకు చేతి చమురు వదలించుకోవడమే కాదు.. చాలా వ్యయప్రయాసలు పడాల్సి వచ్చేది. రవాణ శాఖ పరిధిలోని ఆర్టీఏ కార్యాలయాల్లోకి వెళ్లగానే ప్రతి దానికో రేటును అక్కడి దళారులు నిర్ణయిస్తుంటారు. వాస్తవానికి రూ.వెయ్యి లోపే అయ్యే పనికి దళారులు రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తారు. మనం ఆ పని చేసుకుంటే రూ.వెయ్యి లోపే ఖర్చవుతుంది. కానీ ఆ పని ఏలా చేసుకోవాలి?, ఎవరితో సంతకం చేయించాలి? అనే విషయం తెలియదు. ఒకవేళ తెలిసి.. అక్కడి సిబ్బంది మనకు సహకరించని పరిస్థితి. దీంతో ఆర్టీఏ కార్యాలయంలో దళారులే రాజ్యం ఏలుతున్నారు.

వీటన్నింటన్ని గమనించిన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులు ఇక నుంచి ఏలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌లోనే పలు రకాల సేవలను పొందేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం. వాహనదారులు ఆన్‌లైన్‌లో లెర్నింగ్ లైసెన్సు, డ్రైవింగ్ లైసెన్సు, బ్యాడ్జి, సాధారణ పత్రాల స్థానంలో స్మార్ట్ కార్డులు వంటి ఐదు రకాల సేవలను ఆన్‌లైన్‌లో పొందే వెసులుబాటు రవాణ శాఖ కల్పించింది. అందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. దీనికితోడు భవిష్యత్తులోనూ మరో 12 రకాల సేవలను ఆన్‌లైన్‌లోనే పొందేలా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ విధానం వల్ల వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాలకు నేరుగా వెళ్లాల్సిన అవసరం లేదు.

ఇంటి వద్ద నుంచే తమకు కావాల్సిన సేవలను పొందే విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటిదాకా పలురకాల ఆర్టీఏ సేవల కోసం మొదట ఆన్‌లైన్‌లో స్లాట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉండేది. ఆ స్లాట్‌లోని తేదీ, సమయం ప్రకారం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొచ్చిన విధానం వల్ల వినియోగదారులు ఇంటిలో ఉండే డూప్లికేట్ లెర్నింగ్ లైసెన్స్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, బ్యాడ్జీ, డ్రైవింగ్ లైసెన్సుల డాక్యుమెంట్ల స్థానంలో స్మార్ట్ కార్డులను తీసుకోవచ్చు. అయితే ఈ సేవలకు వినియోగదారులు స్మార్ట్ ఫోన్‌లోనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటును రవాణ శాఖ కల్పించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles