Will not be scared by Modi-govt's raid raj: Cong ఈడీ, ఐటీ, సీబీఐ దాడులకు భయపడం: గెహ్లాట్

Have majority in assembly not scared of raids says cm gehlot

sachin pilot, Rajasthan Political Crisis, Ashok Gehlot, rajasthan governor, Kalraj Mishra, Sachin pilot, ashok gehlot, AShok loyalists, Rahul Gandhi quit Congress chief, Rebel Congress leader Sachin Pilot, Sachin Pilot sacked, Sachin Pilot BJP, Ashok Gehlot status, rebellion in Rajasthan, Rajasthan Congress crisis, Rajasthan floor test, Rajasthan Assembly, Gulab Chand Kataria, Rajasthan, politics

The Congress termed the central probe agencies like the Enforcement Directorate (ED), which was conducting searches at the residence of chief minister Ashok Gehlot's elder brother and other places in Jodhpur, as 'weapons of intimidation' in the hands of the BJP-led central government.

ఈడీ, ఐటీ, సీబీఐ దాడులకు భయపడం: గెహ్లాట్

Posted: 07/24/2020 05:38 PM IST
Have majority in assembly not scared of raids says cm gehlot

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇవాళ కేంద్రంలోని స్వయం ప్రతిపత్తి గల సంస్థలపై, వాటి పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. కేంద్రాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయ పన్ను శాఖ వంటి దర్యాప్తు సంస్థలు రాజస్థాన్ లో చాలా క్రియాశీలంగా పనిచేస్తున్నాయని నర్మగర్భవ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఈ స్వయం ప్రతిపత్తి కలిగిన స్వతంత్ర సంస్థలు దాడులకు భయపడతామా అంటూ హుంకరింపులకు పోతూ కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం వీటిని అడ్డుగా పెట్టుకుని అటలాడుతోందని విమర్శించారు. ఐటీ, ఈడీ, సీబిఐ దాడులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

తన సోదరుడి ఇంటిపై ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో సీఎం ఇలా స్పందించారు. ఈ సంస్థలు ఎవరి కన్నుసన్నల్లో పనిచేస్తున్నాయో దేశ ప్రజలందరికీ అవగతమైందని అన్నారు. కేంద్రానికి అనుకూలంగా వ్యవహరించే వారిపై ఎన్ని అరోపణలు వచ్చినా ఈ సంస్థలు నిద్రపోతున్నట్టు నటిస్తాయని, అయితే కేంద్రం టార్గెట్ చేసుకున్న వ్యక్తుల విషయంలో రంద్రాన్వేషణ చేసే విధంగా ఆ సంస్థలు పనిచేస్తున్నాయని, ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని, క్షమించబోరని హెచ్చరించారు. ఇటీవల కాంగ్రెస్ విడుదల చేసిన ఆడియో టేపులపై మాట్లాడుతూ.. అవి నిజమైనవేనని, వాటిపై ఎలాంటి దర్యాప్తుకైనా తాము సిద్దమేనని అన్నారు.

ధర్మం, న్యాయం, అంటూ నీతి ప్రవచనాలు వల్లించే నాయకులు అవి కేవలం ప్రజలకు మాత్రమేనని.. తాము ఆచరించబోమని ఈ టేపులే రూడీ చేస్తున్నాయని అన్నారు. వారి మాట్లాడిన మాటలనే అంగీకరించలేని పరిస్థితుల్లోకి జారుకున్నారన్నారు. అయినా సరే ఆ టేపుల్లో ఉన్నది తమ గొంతు కాదని కొందరు వాదిస్తున్నారని గెహ్లాట్ అన్నారు. వారెన్ని చెప్పినా చివరికి సత్యమే గెలుస్తుందన్నారు. ఇక, అసెంబ్లీలో తమకు పూర్తి మెజారిటీ ఉందని, తామంతా ఐకమత్యంగానే ఉన్నామని సీఎం పేర్కొన్నారు. కొందరు ఎమ్మెల్యేలను బందీలుగా పెట్టుకుని వారికి బౌన్సర్లను కాపలాగా పెట్టారని, వారితో కూడా తాము టచ్‌లో ఉన్నామని అన్నారు. వారు కూడా తమ వెంటే ఉంటారని, తమకే ఓటు వేస్తారని గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles