Sachin Pilot Wins A Big Step In SC సుప్రీంకోర్టులో సచిన్ పైలట్ వర్గానికి ఊరట

Voice of dissent in a democracy cannot be shut down sc to rajasthan speaker

AICC, Rajasthan Government, Vishvendra Singh, Bhanwar Lal Sharma, Sachin Pilot BJP, Ashok Gehlot status, rebellion in Rajasthan, Rajasthan Congress crisis, Rajasthan floor test, Rajasthan Assembly, Gulab Chand Kataria, Rajasthan political crisis, Sachin Pilot loyalist MLAs, Sachin Pilot loyalist MLAs Manesar, Manesar, Haryana, Jaipur, Rajasthan, Congress, Politics

Congress rebel Sachin Pilot has scored a good day in court in his fight against former boss and Rajasthan Chief Minister Ashok Gehlot. The Supreme Court today refused to stop the Rajasthan High Court from announcing its decision tomorrow on a petition by Sachin Pilot and 18 other rebel MLAs challenging disqualification notices served to them for defying the Congress party.

రాజస్థాన్ రాజకీయ సంక్షోభం: సుప్రీంకోర్టులో సచిన్ వర్గానికి ఊరట

Posted: 07/23/2020 06:18 PM IST
Voice of dissent in a democracy cannot be shut down sc to rajasthan speaker

రాజస్థాన్ లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన రసకందాయ పరిస్థితుల్లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే వుంది, అసమ్మతి జెండా ఎగురవేసిన ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతూన్న.. వారికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలో సచిన్ పైలట్ వర్గానికి అత్యున్నత న్యాయస్థానంలో స్వల్ప ఊరట లభించింది. సచిన్‌ పైలట్‌ వర్గంపై ఈ నెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ రాజస్థాన్‌ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ అసెంబ్లీ స్పీకర్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారించిన న్యాయస్తానం స్పీకర్ కు వ్యతిరేకంగా నిర్ణయాన్ని వెలుబుచ్చింది.

రాజస్థాన్ స్పీకర్ కోరినట్టుగా సచిన్ పైలెట్ వర్గంపై చర్యలు తీసుకునేందుకు అనుమతిని ఇవ్వలేమని.. రాజస్తాన్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తాము కూడా సముచితమని భావిస్తున్నామని న్యాయస్థానం పేర్కోంది, అందుచేత స్పీకర్ పిటీషన్ పరిశీలించిన మీదట హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించలేమని అభిప్రాయానికి వచ్చింది, దీంతో సచిన్‌ పైలట్‌ వర్గానికి మరోసారి ఊరట లభించింది. రేపు సచిన్ పైలెట్ వర్గం ధాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన రాజస్థాన్‌ హైకోర్టు తీర్పు వెలువరించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, హైకోర్టు ఆదేశాల అమలు మాత్రం సుప్రీంకోర్టులో వచ్చే ఫలితంపైనే ఆధారపడి ఉండాలని జస్టిస్ అరుణ్ మిశ్రా వెల్లడించారు.

అంతేకాకుండా సుప్రీంకోర్టులో స్పీకర్ లేవనెత్తిన అంశాలపై సుదీర్ఘ విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ సభ్యులు పార్టీకి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించలేరా అని అత్యున్నా న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ మిశ్రా ప్రశ్నించారు. పార్టీలో కూడా ప్రజాస్వామ్యవాదం జీవించాలని అభిప్రాయపడ్డారు. అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం తీసుకునే నిర్ణయాలకు పార్టీలోని సభ్యులందరూ తప్పకుండా అమలు పర్చాలా..? అని ప్రశ్నించింది, అంతేకాకుండా అసమ్మతి స్వరాన్ని అణచివేయలేరన్నారు.

అంతకుముందు స్పీకర్‌ తరపున వాదనలు వినిపించిన కపిల్ సిబల్ రాజస్థాన్ హైకోర్టులోని కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోర్టును కోరారు. దీనిపై ఇప్పటికిప్పుడు అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం స్పష్టం చేసింది. స్పీకర్‌ విచక్షణాధికారాల్లో కోర్టు జోక్యం చేసుకోలేదని స్పీకర్‌ తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. స్పీకర్‌ అనర్హత వేటుపై నిర్ణయం తీసుకున్నాకే న్యాయసమీక్షకు అవకాశం ఉందని కపిల్‌ సిబాల్‌ కోర్టుకు విన్నవించారు. అంతేకాకుండా స్పీకర్‌ నిర్ణయం తీసుకోకముందే హైకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందనే ప్రశ్న లేవనెత్తారు. ఈ అంశాలపై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ చేపడతామని తెలిపింది.

రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషి సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ లో.. పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్ దే తుది నిర్ణయమని, అనర్హతపై స్పీకర్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుందని పేర్కొన్నా.. న్యాయస్థానం అందుకు సమ్మతించలేదు. మరోవైపు స్పీకర్ కు చెక్‌ పెట్టేందుకు సచిన్‌ పైలట్‌ వర్గం కూడా సుప్రీంకోర్టు కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. తమ వాదన వినకుండా స్పీకర్‌ దాఖలు చేసిన పిటిషన్ పై ఎలాంటి ఉత్తర్వులు వెలువరించకూడదని పిటిషన్ లో పేర్కొంది. మరి ఈ రెండు పిటీషన్లు వేర్వేరుగా దాఖలవ్వడంతో వేర్వురుగానే విచారణ చేపట్టనుంది న్యాయస్థానం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles