Afghan girl kills two Taliban fighters ప్రతీకారం తీర్చుకున్న బాలిక.. ముగ్గురు ఉగ్రవాదులను కాల్చివేత

Afghan girl kills two taliban fighters after they murdered her parents

Afghan girl, Qamar Gul, Parents, gun battle, central Ghor province, AK-47 rifle, Taliban terrorists, Afghanistan government

A 16-year-old Afghan girl Qamar Gul shot dead three Taliban terrorists with her family's AK-47 assault rifle to avenge the killing of her parents for being supporters of the Afghanistan government.

ప్రతీకారం తీర్చుకున్న బాలిక.. ముగ్గురు ఉగ్రవాదులను కాల్చివేత

Posted: 07/22/2020 09:05 PM IST
Afghan girl kills two taliban fighters after they murdered her parents

సినీపక్కీలో ప్రతీకారం తీర్చుకుంది ఓ బాలిక. అయితే ఇదేదో సినిమా కోసం చేసిన షూట్ కాదు. లేక అవతలి వాళ్లు అనామకులు అంతకన్నా కాదు. నరనరాల్లో ఉగ్రవాద పారుతున్న ముగ్గరు ముష్కరులపై ఆ బాలిక ఏకంగా తుపాకీని ఎక్కుపెట్టి ప్రతీకారం తీర్చుకుంది. తన కళ్లముందే తల్లిదండ్రులను విచక్షణ రహితంగా కాల్చి చంపిన ముష్కరులపై సింగంలా దూకిందో 15 ఏళ్ల బాలిక. ఏమాత్రం భయం లేకుండా తుపాకి అందుకుని వారిపై తూటాల వర్షం కురిపించింది. వారిని మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఘటన ఆఫ్ఘనిస్థాన్‌లోని సెంట్రల్‌ఘర్ ప్రావిన్స్‌లో జరిగింది.

ఆలస్యంగా వెలుగు చూసింది ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. గ్రామ పెద్ద ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుండడం తాలిబన్లకు కోపం తెప్పించింది. దీంతో అతడ్ని హతమార్చాలని నిర్ణయించుకుని ఈ నెల 17న అతడి ఇంటికి వచ్చారు. రాత్రి ఒంటిగంట సమయంలో ఇంటికి వెళ్లి తలుపుకొట్టారు. తలుపు తీసిన బాలిక కమర్ గుల్ తల్లి తలుపు తీసింది. అయితే, వచ్చింది ఉగ్రవాదులని తెలుసుకున్న వెంటనే అప్రమత్తమై తలుపులు మూసేసింది. దీంతో ఉగ్రవాదులు ఆమెపై కాల్పులు జరిపి లోపలికి ప్రవేశించి బాలిక తండ్రిని కూడా కాల్చి చంపారు. తన కళ్ల ముందే తల్లిదండ్రులను కాల్చి చంపడంతో బిక్కచచ్చిపోయిన బాలిక ఆ వెంటనే తేరుకుంది.

ఇంట్లో ఉన్న ఏకే-47 తుపాకి తీసుకుని ఉగ్రవాదులు ముగ్గురినీ కాల్చి పారేసింది. అంతేకాదు, తనను చంపేందుకు ప్రయత్నించిన మరికొందరు ఉగ్రవాదులతో గంటకుపైగా వీరోచితంగా తలపడింది. తనతోపాటు ఉన్న 12 ఏళ్ల తమ్ముడిని కాపాడుకుంటూనే ఉగ్రవాదులతో పోరాడింది. ఈ లోగా విషయం తెలిసిన గ్రామస్థులు, ప్రభుత్వ అనుకూల మిలిటెంట్లు ఆమెకు సాయంగా రావడంతో ఉగ్రవాదులు పరారయ్యారు. బాలిక కాల్పుల్లో ఉగ్రవాదుల్లో కొందరు గాయపడ్డారు. కాగా, ఉగ్రవాదులపై అసమాన పోరాట ప్రతిభ చూపిన బాలిక కమర్, ఆమె తమ్ముడిని అధ్యక్షుడు అష్రఫ్ ఘని అభినందిస్తూ, తమ అధికార నివాసానికి వారిని ఆహ్వానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles