Not on speaking terms with Pilot Gehlot కీలక విషయాన్ని బట్టబయలు చేసిన అశోక్ గెహాట్

Not on speaking terms with sachin pilot for last 18 months ashok gehlot

AICC, Rajasthan Government, Vishvendra Singh, Bhanwar Lal Sharma, Sachin Pilot BJP, Ashok Gehlot status, rebellion in Rajasthan, Rajasthan Congress crisis, Rajasthan floor test, Rajasthan Assembly, Gulab Chand Kataria, Rajasthan political crisis, Sachin Pilot loyalist MLAs, Sachin Pilot loyalist MLAs Manesar, Manesar, Haryana, Jaipur, Rajasthan, Congress, Politics

In a big reveal, Rajasthan chief minister Ashok Gehlot has said he has not been on talking terms with his former deputy chief minister Sachin Pilot since the past 18 months and that Pilot was plotting to topple his government from the first day.

రాజస్థాన్ లో కీలక విషయాన్ని బట్టబయలు చేసిన అశోక్ గెహాట్

Posted: 07/18/2020 10:56 PM IST
Not on speaking terms with sachin pilot for last 18 months ashok gehlot

రాజస్థాన్ లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం రసకందాయంలో పడినా.. అసమ్మతి జెండా ఎగురవేసిన ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతూనే వుంది. ఈ క్రమంలో సచిన్ పైలట్ వినిపించిన అసమ్మతి రాగానికి తోడు సన్నాయి నోక్కులను కూడా పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం.. ఇకపై సచిన్ పైలెట్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయరాదని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు సూచనలు కూడా జారీ చేసింది. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పగ్గాలు వదిలిన మరుక్షణం నుంచి తనను గెహ్లాట్ వర్గం టార్గెట్ చేసిందని చెప్పడంతో..  ఆ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న అధిష్టానం తాజాగా అదేశాలను జారీ చేసింది.  

తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ఓ కీలక విషయాన్ని బయటపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్‌తో అసలు 18 నెలల నుంచి మాటల్లేవన్నారు. తమిద్దరి మధ్య అసలు ఒక్కసారి కూడా చర్చలు జరగలేదన్నారు. డిప్యూటీ సీఎం అయినా కూడా ఎప్పుడూ కనీసం ముఖ్యమంత్రితో మాట్లాడలేదని, ఏ అంశం మీద కూడా తన అభిప్రాయం తెలుసుకోలేదని చెప్పారు. ఒకవేళ అసమ్మతి ఉన్నా కూడా ప్రజాస్వామ్యంలో చర్చలు అనేవి ఉండాలి కదా అని సీఎం అశోక్ గెహ్లోత్ చెప్పినట్టు హిందుస్తాన్ టైమ్స్ కథనాన్ని రాసింది. ఒకవేళ సచిన్ పైలెట్ మళ్లీ కాంగ్రెస్ పార్టీతో కలసి పనిచేసేందుకు ముందుకొస్తే ఓ ఆత్మీయ ఆలింగనం ఇచ్చి స్వాగతిస్తానన్నారు.

‘నేను మొదటి సారి ఎంపీ అయినప్పుడు అతడు మూడేళ్ల పిల్లాడు. సచిన్ పైలెట్ కుటుంబంతో నాకు కొన్ని దశాబ్దాల అనుబంధం ఉంది. అతడిని నేను ఆత్మీయ ఆలింగనంతో స్వాగతిస్తా’ అని రాజస్థాన్ సీఎం చెప్పారు. జూన్ 10వ తేదీనే సచిన్ పైలెట్ తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో కలసి వెళ్లిపోవాలనుకున్నారని, కానీ తానే చొరవ తీసుకుని వారికి నచ్చజెప్పానన్నారు. ‘రాత్రి 2 గంటలకు వాళ్లు వెళ్లిపోవాలనుకున్నారు. నేను నా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. రాత్రి 1 గంటకి నిద్రలేచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడా. అందరు నేతలకూ ఫోన్లు చేసి వెంటనే అందరూ జైపూర్ రావాల్సిందిగా కోరా. దాదాపు అందరూ వచ్చేశారు. ఆ తర్వాత వీళ్లు ఇందులో కుట్ర ఏమీ లేదని చెప్పడం మొదలు పెట్టారు. కానీ, నా దగ్గర అప్పుడూ సాక్ష్యం ఉంది. ఇప్పుడూ ఉంది.’ అని అన్నారు. సచిన్ పైలెట్ బీజేపీలో చేరాలని అనుకున్నా.. ఆయనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం కమలం గూటికి చేరేందుకు సిద్ధంగా లేరన్నారు.

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరడం ద్వారా కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కూల్చి కమలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన జ్యోతిరాదిత్య సింథియా గురించి కూడా అశోక్ గెహ్లాట్ స్పందించారు. ‘పార్టీకి ద్రోహం చెయ్యకూడదు. పార్టీ మీకు ఎన్నో ఇచ్చింది. నేను మూడు సార్లు కేంద్ర మంత్రిగా ఉన్నా. మూడు సార్లు పీసీసీ చీఫ్ గా పనిచేశా. మూడుసార్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నా. మూడుసార్లు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నా. ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్నో కష్టాలు పడి పైకొచ్చా. మా జనరేషన్ లో నేతలు ఎంతో కష్టపడ్డాం. పార్టీకి, సిద్ధాంతానికి కట్టుబడి పనిచేశాం. అందుకే ఈ రోజు ఈస్థాయిలో ఉన్నాం.’ అని గెహ్లోత్ అన్నారు.

మరోవైపు రాజస్థాన్ రాజకీయ సంక్షోభంలో సీఎం అశోక్ గెహ్లాట్ కు కొంచెం ఊరట లభించింది. ఇద్దరు ప్రాంతీయ పార్టీ ఎమ్మెల్యేలు గెహ్లాట్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలికారు. భారతీయ ట్రైబల్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ మద్దతును ప్రకటించారు. పార్టీ విప్‌ను ధిక్కరించి వారు గెహ్లాట్ కు బాసటగా నిలిచారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎమ్మెల్యేలు అశోక్ గెహ్లాట్ ను కలసి తమ మద్దతు లేఖను అందజేశారు. ‘భారతీయ ట్రైబల్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పార్టీ నేతలతో కలసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలికారు.’ అంటూ గెహ్లోత్ హిందీలో ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles