Tough Day For Us At Twitter: Jack Dorsey ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్ల హ్యాకింగ్ పై సీఈఓ జాక్ డార్సీ స్పందన..

We all feel terrible twitter ceo jack dorsey on hacked high profile accounts

Twitter, Twiiter hack news, Jack Dorsey, Twitter users, Bitcoin scam, Barack Obama, Joe Biden, Elon Musk, Jeff Bezos, Bill Gates, Technology news, social media

A massive hacker attack targeted high-profile Twitter users including former US president Barack Obama, US presidential candidate Joe Biden, and former New York City mayor Mike Bloomberg. In a post Twitter CEO Jack Dorsey said it's a 'tough day for us at Twitter'.

ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్ల హ్యాకింగ్ పై సీఈఓ జాక్ డార్సీ స్పందన..

Posted: 07/16/2020 02:21 PM IST
We all feel terrible twitter ceo jack dorsey on hacked high profile accounts

ఓవైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో మరోవైపు సైబర్‌ నేరగాళ్లు కూడా ప్రపంచవ్యాప్తంగా అక్రమాలకు తెరలేపుతున్నారు. ఇప్పటికే ఫిషింగ్, స్వాపింగ్ లు చేసి స్మార్ట్ ఫోన్ వినియోగదారుల బ్యాంకుల నుంచి వారి కష్టార్జితాలను దొచుకుంటున్న కేసులు అధికమయ్యాయి. ఇక మరోవైపు హ్యాకర్లు కూడా తమ సత్తా చాటుతున్న క్రమంలో ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ‘ట్విటర్‌’ వణికిపోయింది. తాజాగా ప్రపంచ వాణిజ్యరంగ దిగ్గజాలు, ప్రముఖుల ట్విటర్‌ అఫీషియల్ అకౌంట్స్ ను హ్యాకర్లు అటాక్ చేశారు. దీనిపై తాజాగా కంపెనీ సీఈవో జాక్‌ డోర్సే స్పందించారు. ‘ఈ అనూహ్య ఘటనను భయానక దాడిగా భావిస్తున్నామన్నారు. ఇది తమకెంతో కఠినమైన రోజుగా పేర్కోన్నారు. అసలు ఇదంతా ఎలా జరిగిందని పరిశీలిస్తున్నామన్నారు. తమకు ఈ విషయంలో నిజాలను కనుగొన్న తరువాత ఖాతాదారులతో వివరాలను పంచుకుంటామన్నారు.

అయితే తమ అంతర్గత వ్యవస్థల సాయంతో ఉద్యోగులను కూడా లక్ష్యంగా చేసుకొని దాడికి ప్రయత్నించినట్లు భావిస్తున్నామని అని ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నామని చెప్పారు. సాధ్యమైనంత తొందరలో సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ట్విటర్‌ టీం కృషిచేస్తోందని ఆయన అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, అమెజాన్‌ సీఈవో జెఫ్ బెజోస్‌, బిల్‌గేట్స్‌, వారెన్‌ బఫెట్‌, ఎలాన్‌ మస్క్‌తోపాటు మరికొందరి ట్విటర్‌ ఖాతాలు హ్యాకింగ్ కు గురికావడంతో ట్విట్టర్ అకౌంట్ల హ్యకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వీరితో పాటు బ్లూమ్ బర్గ్‌, ఉబెర్‌, యాపిల్‌ కంపెనీల అధికారిక ట్విటర్‌ ఖాతాలు కూడా హ్యాకర్ల బారిన పడినట్లు సమాచారం. క్రిప్టో కరెన్సీ రూపంలో తమకు డొనేషన్లు కావాలంటూ వారి ఖాతాల్లో సైబర్‌ నేరగాళ్లు సందేశాలు పెట్టినట్లు గుర్తించారు.

దీంతో అప్రమత్తమైన ట్విటర్‌ సాంకేతిక బృందం వెంటనే ఆ అనుమానాస్పద ట్వీట్లను తొలగించింది. ప్రస్తుతం హ్యాక్ కు గురైన ట్విటర్ ఖాతాలు మాత్రం యథావిధిగా పనిచేస్తున్నాయని పేర్కొంది. ఇదిలా ఉంటే, బిట్‌కాయిన్‌ ఆశచూపి స్కామ్‌ చేసే ఘటనలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. 2017లో ఇలాంటి భారీ హ్యాక్‌ జరిగినప్పటికీ అది కొన్ని సంస్థల ఖాతాలపైనే జరిగింది. కానీ, ఈసారి ప్రపంచకుబేరులు, ప్రముఖుల అధికారిక ఖాతాలపై దాడిచేయడం అనూహ్య పరిణామమని సైబర్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనే అతిపెద్ద హ్యాకింగ్‌లలో దీనిని కూడా ఒకటిగా పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh