WHO admits airborne Covid spread గాలి నుంచీ కరోనా వ్యాపి: అంగీకరించిన WHO

No need for panic over research of coronavirus being airborne says expert

coronavirus, covid-19, coronavirus symptoms, air borne, coronavirus transmission, coronavirus symptoms, scientists, WHO, OPen letter lockdown, covid-19 india, Coronavirus treatment, Health, Coronavirus, Covid-19, airborne transmission, World Health Organization, WHO, coronavirus transmission, Coronavirus symptoms, corona in India

In another revision, the WHO has now acknowledged that there is emerging evidence of airborne transmission of the novel coronavirus. The change of opinion came after 200 scientists accused the global health body of underestimating the possibility of airborne transmission in an open letter.

గాలి నుంచీ.. కరోనా వ్యాప్తి: అంగీకరించిన ప్రపంచ అరోగ్యసంస్థ

Posted: 07/08/2020 10:49 PM IST
No need for panic over research of coronavirus being airborne says expert

(Image source from: Dnaindia.com)

కొవిడ్-19 వైరస్ ఎంతటి ప్రమాదకారి వైరస్ ఇప్పటికే ప్రపంచవ్యాప్త ప్రజలకు అవగతమైంది. ఇంతలా ఎలా విస్తరిస్తోందన్న అలోచనలతో శాస్త్రవేత్తల పరిశోధనలు సాగాయి. ఫలితంగా 32 దేశాలకు చెందిన 239 మంది వైద్య నిపుణుల బృందం.. ఈ మహమ్మారి గాలి నుంచి కూడా సోకుతుందని అందుకు తమ వద్ద ఆధారాలు కూడా వున్నాయిని ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాశారు. గాలి నుంచి కరోనా వ్యాధి సంక్రమిస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న దాంట్లో నిజం లేదని కూడా వైద్య నిపుణుల బృందం లేఖలో పేర్కోంది. అయితే శాస్త్రవేత్తల బృందం రాసిన లేఖ నేపథ్యంలో ప్రపంచ అరోగ్య సంస్థ తమ వాదనను ఉపసంహరించుకుంది. అంతేకాదు.. గాలి నుంచి కరోనా వైరస్ సోకుతుందన్న వాదనలను కొట్టిపారేయలేమని కూడా అంగీకరించింది.

గాలి నుంచి కరోనా సంక్రమిస్తుందన్న ఆధారాలను పరిగణలోకి తీసుకున్న డబ్యూహెచ్ఓ మరింత పక్కగా ఆధారాల కోసం తాము ప్రయత్నిస్తున్నామని పేర్కోంది. జనసామర్థ్యం అధికంగా వున్న ప్రాంతాల్లో, గాలి, వెలుతురు సరిగ్గా లేని ప్రాంతాల్లో గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న వాదనలను కోట్టిపారేయలేమని చెప్పింది. అయితే దీనికి సంబంధించి మరిన్ని ఆధారాలను సేకరించి విశ్లేషించాల్సి వుందని అన్నారు, ఆ దిశగా తమ ప్రయత్నాలు సాగుతున్నాయని అన్నారు. గాలి ద్వారా, చిన్న చిన్న తంపర్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుందన్న వాదనపై చర్చిస్తున్నామని అన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో సమీక్షించిన తరువాత మార్గదర్శకాల సవరణపై త్వరలో ఓ ప్రకటన చేస్తామని వెల్లడించారు.

గాలి ద్వారా వ్యాపిస్తుందన్న శాస్త్రవేత్తల వాదన డబ్ల్యూహెచ్‌వోతో విభేదించడం కాదని బృందంలో ఓ సభ్యుడైన కొలరెడో విశ్వవిద్యాలయానికి చెందిన రసాయన రంగ నిపుణుడు జోస్‌ జిమెనెజ్‌ అన్నారు. ఈ వాదనను పరిగణించాలని మాత్రమే తాము కోరినట్లు తెలిపారు.  ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే లేఖ రాశామని తెలిపారు. అనేక చర్చల తర్వాత కూడా డబ్ల్యూహెచ్‌వో మా ఆధారాల్ని అంగీకరించడానికి నిరాకరించడంతో బహిరంగ లేఖ రాయాల్సి వచ్చిందని వివరించారు. అయితే, గాలి ద్వారా, అతి చిన్న తుంపర్ల కారణంగా వైరస్ వ్యాపిస్తుందన్న వాదనను వైద్య వర్గాలు అనాదిగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయని తెలిపారు. ఈ వాదన రుజువు చేయడానికి బలమైన ఆధారాలు చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles