Woman SI in Gujarat arrested for taking Rs 20 lakh bribe అత్యాచార నిందితుడి లంచం.. మహిళా ఎసై అరెస్టు

Woman sub inspector arrested for demanding rs 35 lakh bribe from rape accused

Woman SI, sub-inspector, Shweta Jadeja, arrest, Rs 35 lakh bribe, rape case, accused, Kenal Shah. West Mahila police station, PSI, Gujarat PSI, prevention of anti social activites act, Mahila post station, Kenal Shah, Shweta Jadeja, FIR woman PSI, Ahmedabad, Gujarat, crime

A woman police sub-inspector (PSI) in Ahmedabad has been arrested for allegedly accepting a bribe of Rs 35 lakh from a rape accused for not charging him under the Prevention of Anti-Social Activities Act. An FIR was booked against Ahmedabad-West Mahila police station in-charge Shweta Jadeja for allegedly demanding Rs 35 lakh from a rape accused.

అత్యాచార నిందితుడి నుంచి రూ.35లక్షల లంచం.. మహిళా ఎసై అరెస్టు

Posted: 07/06/2020 10:46 PM IST
Woman sub inspector arrested for demanding rs 35 lakh bribe from rape accused

అత్యాచార నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టకుండా వుండేందుకు ఏకంగా రూ.35 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఓ మహిళా ఎస్ఐ అడ్డంగా బుకయ్యింది. అత్యాచార కేసులో నిందితుడిపై కేసు నమోదు కాగానే రూ.20 లక్షల డబ్బును పోందిన తరువాత కూడా అతడి తమ్ముడిని బెదిరించి.. పూర్తి డబ్బును డిమాండ్ చేసిన కిలాడి మహిళా ఎస్ఐని అహ్మాదాబాద్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. మహిళగా వుంటూ మహిళలపై అత్యాచారం చేశాడన్న అభియోగాల నేపథ్యంలో బాధిత మహిళలకు న్యాయం చేయాల్సిన ఎస్ఐ అన్యాయంగా నిందితులకు న్యాయాన్ని అమ్మేందుకు పెట్టిన ఎస్ఐపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మహిళా ఎస్ఐను అరెస్టు చేయడంపై బాధితులతో పాటు మహిళా సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. డబ్బు కోసం మాన, ప్రాణాలను కూడా అమ్ముకునే నీతి లేని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. నిందితుడిపై సంఘ వ్యతిరేక కార్యకాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఆమె లంచం డిమాండ్ చేసారని ఆరోపణలు వచ్చాయి. అసలేం జరిగిందంటే అహ్మాదాబాద్ లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేసే ఇద్దరు మహిళలు ఆ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కెనాల్‌ షా తమపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019లో ఈ కేసు నమోదు కాగా, దర్యాప్తు కొనసాగుతూ వస్తోంది. కాగా, ఇటీవల ఈ కేసు విచారణ అహ్మదాబాద్‌ మహిళా పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తోన్న శ్వేతా జడేజాకు అప్పగించారు.

కేసు విచారణ ప్రారంభించిన శ్వేత.. నిందితుడి నుంచి రూ.35 లక్షల లంచం డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిందితుడి సోదరుడు భావేష్‌ను హెచ్చరించారు. భావేష్‌ ఓ మధ్యవర్తి ద్వారా 20లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకొని, అ మొత్తాన్ని అప్పజెప్పాడు. కొద్ది రోజుల తర్వాత మరో 15లక్షలు ఇవ్వాలని ఎస్‌ఐ నుంచి ఒత్తిడి రావడంతో సిటీ క్రైమ్‌ పోలీసులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి శ్వేతను అరెస్ట్‌ చేశారు. రూ.20లక్షల లంచం తీసుకుని, మరో 15లక్షలు డిమాండ్‌ చేసినట్లు ఎఫ్‌ఐఆర్ లో నమోదు చేశారు. ఈ మొత్తం కేసు దర్యాప్తును స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఏసీపీ బీసీ సోలంకికి అప్పగించినట్లు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ పోలీస్ కమిషనర్ అజయ్ తోమర్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PSI  Gujarat SI  Mahila post station  Kenal Shah  Shweta Jadeja  Bribe  FIR woman PSI  Ahmedabad  Gujarat  crime  

Other Articles