Telangana govt defends its health care ప్రభుత్వ చిత్తశుద్దిని శంఖించరాదు: ఈటెల

Telangana govt defends covid 19 patients health care

Telangana COVID update, KCR, Telangana COVID-19 update, E Rajender press conference, Hyderabad lockdown,Telangana, GHMC, Hyderabad lockdown, telangana coronavirus, telangana man dying video, telangana healthcare

The Telangana government has denied allegations of neglect in treatment of a man who succumbed at the Government Chest Hospital. A test report that came later revealed him to be Covid-19 positive. In a disturbing video message to his family, the 34-year-old man on a hospital bed claimed that he was not provided life support even as he was struggling to breathe.

ప్రభుత్వ చిత్తశుద్దిని శంఖించరాదు.. మళ్లీ పరీక్షలు షురూ: ఈటెల

Posted: 06/30/2020 12:03 AM IST
Telangana govt defends covid 19 patients health care

దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్నాయని.. అన్ని రాష్ట్రాల్లోనూ పెరుగుతున్నట్లుగానే తెలంగాణలోనూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోందని తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కరాళనృత్యం చేస్తున్న తరుణంలో మరణాలు కూడా సంభవిస్తున్నా.. మన దేశంలో కరోనా బారిన పడి మరణిస్తున్న వారు తక్కువేనని అన్నారు. దేశవ్యాప్తంగా మరణాలు రేటు 3శాతంగా ఉంటే తెలంగాణలో 1.7శాతంగా ఉందని తెలిపారు. కరోనాతో నాలుగు నెలల క్రితం ఉన్న భయాందోళన ఇప్పుడు లేదన్నారు. అన్ని మెట్రోపాలిటిన్ నగరాల్లో కరోనా కేసుల ఉద్దృతి కొనసాగుతోందని.. ఢిల్లీ, ముంబై, కోల్ కతాలలొ కరోనా కేసులు హైదరాబాద్ లోనూ పెరిగాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో కరోనాతో 240మంది చనిపోయారని ఆయన తెలిపారు.

కరోనా పరీక్షల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పిన ఆయన ఇక రేపటి నుంచి పెద్ద మొత్తంలో స్వాబ్‌ సేకరణ చేపడతామన్నారు. ఐసీఎంఆర్‌ నిబంధనలకు అనుగుణంగా హోం క్వారంటైన్ లో చికిత్స చేస్తామని చెప్పారు. రేపటి నుంచి మళ్లీ కరోనా పరీక్షలు కొనసాగించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లో కరోనా కేసులు ఉన్నచోట కంటైన్ మెంట్ జోన్లు పెడతామని అన్నారు. అవసరమైతే హైదరాబాద్ లో లాక్ డౌన్ పై ఆలోచన చేయాల్సి ఉంటుందని సీఎం చెప్పారన్నారు. హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనూ లాక్ డౌన్ విధించేందుకు ముఖ్యమంత్రి యోచిస్తున్నారని అన్నారు. ఈ విషయంలో అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తరువాతే నాలుగైదు రోజుల్లో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ప్రభుత్వహాస్పిటళ్లలో పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. కానీ అది అవాస్తవం. వేరే పేషెంట్ల తరహాలో కరోనా లక్షణాలున్న వారు కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి.. వారికి ఫోన్, ఇంటర్నెట్‌ను అందుబాటులో ఉంచారు. చెస్ట్ హాస్పిటల్‌లో మరణించిన వ్యక్తి.. అనేక హాస్పిటళ్లు తిరిగిన తర్వాత అక్కడికి వచ్చారు. వెంటిలేటర్ కంటే ఆక్సిజన్ ముఖ్యమనే ఉద్దేశంతో ఆక్సిజన్ అందించాం. అదే చెస్ట్ హాస్పిటల్‌లో హెడ్ నర్స్ చనిపోయింది. ప్రాణాలకు తెగించి కరోనా చికిత్స అందిస్తోన్న వైద్యసిబ్బందిపై ఆరోపణలు గుప్పించడం బాధాకరం. వందల సంఖ్యలో ప్రభుత్వ వైద్య సిబ్బందికి, ఉద్యోగులకు కరోనా వచ్చిన నయం అవుతోంది. కానీ ఇతర సమస్యల కారణంగా చనిపోయిన వారిని హైలెట్ చేసి.. ప్రభుత్వ హాస్పిటళ్లలో పని చేసే వారి నైతిక స్థ్యైరాన్ని దెబ్బతీయొద్దని కోరారు.

లక్షణాలు లేకున్నా ప్రయివేట్ హాస్పిటళ్లకు వెళ్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే విషయంలో, వైద్యం అందించే విషయంలో ప్రభుత్వ కమిట్‌మెంట్‌ను, కేసీఆర్ అంకితభావాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. ఏది మంచిదో అదే చేస్తున్నా. కేసీఆర్ టెస్టులు పెంచమని సూచించారు. కాబట్టి టెస్టులు పెంచుతామని అన్నారు. 17,081 బెడ్లలో 3500 బెడ్లకు ఆక్సిజన్ అందుబాటులో ఉంది.. మొత్తం పది వేల బెడ్లకు ఆక్సిజన్ సమకూర్చే ప్రయత్నం చేస్తున్నాం. వెయ్యి వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి. గాంధీలో వెంటిలేటర్ల మీద ఉన్న పేషెంట్లు పది మంది మాత్రమే. ఎక్కడా బెడ్ల కొరత లేదు. శ్వాబ్ కలెక్షన్ సెంటర్లకు వచ్చి నమూనాలు ఇవ్వండి.

బాధ్యత లేని వ్యక్తులు రాసే రాతలను నమ్మొద్దు. ప్రభుత్వ కమిట్‌మెంట్‌ను శంకించొద్దు. ఎన్ని వందల కోట్లు ఖర్చయినా చికిత్స అందిస్తాం. గాంధీ హాస్పిటల్ మినహా మిగతా అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలో ముందుగా చికిత్స అందిస్తున్నాం. తర్వాత కరోనా పరీక్షలు చేస్తున్నాం. ప్రయివేట్ హాస్పిటళ్లలో 1000 బెడ్లకు మించి కరోనాకు కేటాయించలేరు. కానీ తెలంగాణలో గాంధీ, చెస్ట్ హాస్పిటల్, కింగ్ కోఠి, టిమ్స్ లాంటి ప్రభుత్వ హాస్పిటళ్లు కోవిడ్ స్పెషాలిటీ హాస్పిటళ్లుగా ఉన్నాయి. మా దగ్గర మందులు, బెడ్లు, ఆక్సిజన్ కొరత లేదు. ప్రభుత్వ హాస్పిటళ్ల కంటే ప్రయివేట్ హాస్పిటళ్లలో చికిత్స గొప్పగా అందించేదేం లేదు. ప్రయివేట్ హాస్పిటళ్లు బెడ్ల సంఖ్యను పెంచుకోలేవు.

గాంధీ హాస్పిటల్‌లో సౌకర్యాలు ఉన్నాయి. డిప్యూటీ సెక్రటరీ అరుణ్ కుమార్ గాంధీలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు కోవిడ్ లక్షణాలు లేకపోవడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న ప్రజాప్రతినిధులకు చాలా కాలంగా ఫ్యామిలీ డాక్టర్లు ఉంటారు. కాబట్టి వాళ్లు ఫ్యామిలీ డాక్టర్లు ఉన్న కార్పొరేట్ హాస్పిటళ్లలో చేరుతున్నారు. అలాంటప్పుడు గాంధీ ఆసుపత్రిలో వచ్చి చేరమని చెప్పలేం కదా’’ అని ఈటల వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  COVID update  KCR  Etala Rajender  Hyderabad lockdown  GHMC  Hyderabad lockdown  Telangana  

Other Articles