YSRCP MP meets Union ministers asks for Security కేంద్రమంత్రులను కలసి రక్షణ కోరిన రఘురామ కృష్ణంరాజు

Raghurama krishnam raju meets union ministers asks for security

AP Police, Kishan Reddy, Rajnath singh, Rama Raju, VijaySai Reddy, General Secretary, Raghu Rama Krishnam Raju, Raghu Rama Krishnam Raju news, Raghu Rama Krishnam Raju updates, Raghu Rama Krishnam Raju latest, Raghu Rama Krishnam Raju comments, Raghu Rama Krishnam Raju YCP notices, Raghu Rama Krishnam Raju new comments, Raghu Rama Krishnam Raju showcause notice, Raghu Rama Krishnam Raju, YSRCP, High Command, party posts, Narsapuram MP, Andhra Pradesh, Politics

YSRCP Narsapuram MP Raghurama Krishnam Raju meets Union Ministers Rajnath singh and Kishan Reddy asks them for central forces for his secuirty, questioned the legal sanctity, as it was served under the letter head of the YSR Congress Party instead of the party name ‘Yuvajana Sramika Rythu Congress Party’ which is the registered name in the Election Commission of India.

కేంద్రమంత్రులను కలసి రక్షణ కోరిన రఘురామ కృష్ణంరాజు

Posted: 06/27/2020 10:36 PM IST
Raghurama krishnam raju meets union ministers asks for security

నర్సాపురం అధికార పార్టీ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు సొంతపార్టీ వైసీపీపై ఢిల్లీలోని కేంద్ర మంత్రులకు పిర్యాదు చేశారు. వైసీపీ నేతలు తనపై సోషల్ మీడియాతో దుష్ఫ్రచారం చేస్తున్నారని బెదిరింపులకు పాల్పడుతున్నారని అరోపించారు. వైసీపీ నేతలపై దూకుడు పెంచిన ఆయన ఓ వైపు తనకు షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు విజయసాయిరెడ్డికి అర్హత వుందా అని ప్రశ్నించిన ఆయన తనపై సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారంపై జిల్లా ఎస్పీకి పిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయాలను తప్పుబట్టినందుకు.. తనను టార్గెట్ చేశారని అ్నారు.

ఇవాళ ఢిల్లీకి పర్యటనకు వచ్చాన ఆయన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కూడా కలిశారు. ఆనంతరం ఆయన మీడియాతో పాట్లాడుతూ వైసీపీ నేతల బెదిరింపులపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని.. ఒక ఎంపీకే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమయితే.. ఇక సామాన్యుల పరిస్థితి ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో తనకు కేంద్రం నుంచి భద్రత కల్పించాలని కోరినట్టు చెప్పారు, కరోనా పేరుతో తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రమాదం కూడా ఉన్నందున ఇప్పట్లో నియోజకవర్గానికి వెషళ్లబోనని చెప్పారు. తనకు లభించే కేంద్రం భద్రతతోనే నర్సాపురానికి వెళ్తానని చెప్పారు.

తాను పార్టీని, పార్టీ అధినేతను కానీ ఎఫ్పడూ వ్యతిరేకించలేదని, విమర్శించలేదని అన్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తనని వివరించారు. విజయసాయిరెడ్డి ఇచ్చిన షోకాజ్‌ నోటీసుపై స్పందించాలా? ముఖ్యమంత్రికి వివరణ  ఇవ్వాలా? అనే అంశంపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నట్టు చెప్పారు. షోకాజ్‌ నోటీసుకు సంబంధించిన నిబంధనలు తెలుసుకునేందుకు నిన్న ఎన్నికల కమిషన్‌ అధికారులను కలిసినట్టు తెలిపారు. సీఎంను కలిసేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. కానీ, సీఎంను కలిసే అవకాశం లభిస్తుందని తాను అనుకోవడం లేదన్నారు. పార్టీ అధ్యక్షుడిని పల్లెత్తిమాట అననప్పటికీ తనను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles