CBSE Board Cancels Class 10th, 12th Exam 2020 సీబీఎస్ఈ 10, 12 పరీక్షలు రద్దు..

Cbse board exams for classes 10 12 cancelled decision on jee main neet soon

cbse, cbse board exams cancel, cancel cbse board exams, supreme court cbse board exams, hrd ministry cbse board exams, parents cbse board exams, cbse board exam, cbse exam scrapping, supreme court, supreme court on cbse board exam, cbse board exam, cbse 10th exams, cbse 12 exam, cbse board exam cancelled, supreme court, students, parents

The Central Board of Secondary Education (CBSE) has decided to cancel the pending exams for class 10. However, Class 12 students will be evaluated on their performance in the last three school exams. This announcement is also going to impact the admission process of all central universities as well as the national entrance exams including JEE Main and NEET 2020.

సీబీఎస్ఈ 10, 12 పరీక్షలు రద్దు.. జేఈఈ, నీట్ పరీక్షలు కూడా వాయిదా

Posted: 06/25/2020 08:38 PM IST
Cbse board exams for classes 10 12 cancelled decision on jee main neet soon

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)9 10, 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు బోర్డు సఁభ్యులు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు తెలిపారు. దేశంలో కరోనా విజృంభన కొనసాగుతూ.. రోజురోజుకూ వ్యాప్తి అధికమౌతున్న తరుణంలో విద్యార్థుల జీవితాలతో బోర్డు చెలగాటం ఆడకుండా సత్వర్యంగా నిర్ణయం తీసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం.. కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖను అదేశించిన విషయం తెలిసిందే. సీబీఎస్ఈ పరీక్షల నేపథ్యంలో స్పష్టతను ఇవ్వాలని అదేశించిన నేపథ్యంలో గురువారం నాటికి సమయం కొరిన సీబీఎస్ఈ ఇవాళ.. పది, పన్నెండవ తరగతి పరీక్షలను రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది.

జూలై 1 నుంచి జూలై 15 వరకు పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ ను కూడా ప్రకటించిన తరుణంలో తమ పిల్లలను పరీక్షలకు హాజరుకానీయమని పలువురు తల్లిదండ్రులు ట్విట్టర్ సహా సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక మరికొందరు తల్లిదండ్రులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి పిటీషన్ కూడా వేశారు. కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి బోర్డ్ పరీక్షలు హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల భద్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్షల్ని రద్దు చేయాలని, పరీక్షలు మిగిలిన సబ్జెక్టులకు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మార్కులు వేయాలంటూ సుప్రీం కోర్టులో విద్యార్థుల తల్లిదండ్రులు పిటిషన్ వేశారు.

కరోనా వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో 250 పాఠశాలల్లో క్లాస్ 10, 12 పరీక్షల్ని రద్దు చేసి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లేదా ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా సీబీఎస్ఈ మార్కులు వేసిందని, అందరు విద్యార్థులకు అలాగే మార్కులు వేయాలని పేరెంట్స్ కోరారు. దీనిపై సుప్రీం కోర్టు పలుమార్లు విచారణ జరిపింది. పరీక్షల నిర్వహణపై నిర్ణయాన్ని తెలపాలంటూ సీబీఎస్ఈని సుప్రీం కోర్టు కోరింది. ఈ పిటిషన్‌పై మంగళవారం కూడా విచారణ జరిగింది. గురువారం లోగా నిర్ణయాన్ని ప్రకటిస్తామని సుప్రీం కోర్టుకు తెలిపింది సీబీఎస్ఈ. 10వ, 12వ తరగతుల పరీక్షల్ని రద్దు చేస్తున్నట్టు ఇవాళ సుప్రీం కోర్టుకు సీబీఎస్ఈ సమాచారం ఇచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles