ప్రముఖ శ్రీ క్షేత్రం పూరీలోని జగన్నాథుడి రథయాత్ర రథచక్రాలు ప్రతీఏడు మాదిరిగానే ఈ సారి కూడా కదిలాయి. అయితే చారిత్రక నేపథ్యం ఇమిడివుండటంతో ప్రతీ సంవత్సరం పూరికి కదిలివచ్చే లక్షలాది మంది భక్తజన సందోహ మధ్య సాగే రధయాత్ర.. చరిత్రలో తొలిసారిగా భక్తజన సందోహం లేకుండా మంగళవారం అంగరంగ వైభవంగా సాగాల్సిన ఉత్సవాలు నిరాడంబరంగా సాగాయి, దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలతో భక్తులను అనుమతించకుండా రథయాత్రను కొనసాగించారు. ఒక్కో రథానికి 500 మంది చొప్పున మూడు రథాలను లాగడానికి కేవలం 1,500 మందిని మాత్రమే అనుమతించారు. వీరికి కూడా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన తర్వాతే యాత్రలో పాల్గొనడానికి అనుమతించడం విశేషం.
అయితే ఈ రధోత్సవాలు ఆద్యంతం కన్నుల పండువగా సాగాయి. తొలుత ఆలయంలో జగన్నాథ స్వామికి కంకైర్యాలు నిర్వహించి, జగన్నాథ, సుభద్ర, బలభద్ర దేవతా మూర్తులను సర్వాంగ సుందరంగా అలకరించి రథాలపై ప్రతిష్టించారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కఠిన ఆంక్షల మధ్య... స్వామి సేవలో ఉండే ‘సేవాయత్’లే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంతకు ముందు సంప్రదాయం ప్రకారం పూరీ రాజు బంగారు చీపురు పట్టుకుని రథాల ముందు ఊడ్చి, స్వామికి సేవలు నిర్వహించారు. భక్తులు పాల్గొనకుండా కేవలం ఏడు రోజుల పాటు మాత్రమే రథయాత్ర నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో చరిత్రలోనే తొలిసారిగా రథయాత్రలో కేవలం పూజారులు, సిబ్బంది మాత్రమే పాల్గొన్నారు. అయితే, భక్తులు వీక్షించేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని లైవ్‌లో ప్రసారం చేస్తున్నారు.
మరోవైపు, భక్తుల రాకను నిలువరించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజా రవాణా, ఇతర సౌకర్యాలను ఒడిశా ప్రభుత్వం నిలిపివేసింది. అలాగే, సోమవారం రాత్రి 9.00 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం 2.00 గంటల వరకు పూరీ నగరంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఉత్తర్వులు అమలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆలయ ప్రాంగంణంలో శానిటైజేషన్ ప్రక్రియను చేపట్టారు. సూరత్‌లోని జహంగీర్ పూర ప్రాంతంలో ఉన్న ఇస్కాన్ మందిరంలో రథయాత్రను కేవలం ఆలయ పరిసరాల్లోనే నిర్వహించారు. అతి కొద్ది మందిని మాత్రమే అనుమతించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ తర్వాత సూరత్ ఇస్కాన్ ఆలయంలోనే అత్యంత వైభవంగా రథయాత్ర నిర్వహిస్తారు. కానీ, ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా ఆంక్షలు కొనసాగడంతో యాత్రకు అనుమతించలేదు.
#WATCH Odisha: Priests and 'sevayats' taking the idol of Lord Balabhadra to chariot for the #RathYatra from Jagannath Temple in Puri. pic.twitter.com/ohoWKlTwmm
— ANI (@ANI) June 23, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more