SC allows Jagannath Puri Rath Yatra షరతులతో జగన్నాథ రథయాత్రకు అనుమతి

Supreme court allows jagannath temple rath yatra at puri with conditions

puri jagannath rath yatra, odisha rath yatra, Jagannath Rath Yatra, Jagannath Temple, Puri, Supreme Court, Odisha, covid-19, Corona pandemic, coronavirus

The Supreme court allowed, with conditions, the Rath Yatra at Jagannath Temple in Puri, scheduled for 23 June. The temple committee, central and the Odisha governments have been asked to coordinate the event with necessary curbs to prevent the spread of covid-19.

షరతులతో జగన్నాథ రథయాత్రకు అనుమతించిన సుప్రీం

Posted: 06/22/2020 09:47 PM IST
Supreme court allows jagannath temple rath yatra at puri with conditions

ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీపడకుండా.. ఆలయ కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ప్రభుత్వం కోఆర్డినేషన్‌ చేసుకొని రథయాత్రను నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. పలు ఆంక్షల నడుమ రథయాత్ర జరపాలన్న సుప్రీంకోర్టు... ఒకవేళ పరిస్థితి చేదాటిపోతోందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే, యాత్రను నిలిపివేయవచ్చని సూచించింది. ఇక రథయాత్ర నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని ఒడిశా తరఫు న్యాయవాది హరీశ్‌ సాల్వే సుప్రీంకోర్టుకు తెలిపారు. కోర్టు తీర్పు నేపథ్యంలో రథయాత్రపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సమీక్ష నిర్వహించారు.

పూరీలో జూన్ 23 నుంచి రథయాత్ర జరగనుంది. ప్రతి ఏటా 10-12 రోజుల పాటు జగన్నాథుడి రథయాత్రను కన్నుల పండవగా నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు ఇందులో పాల్గొని పులకించిపోతారు. కానీ ఈసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో యాత్రను నిలిపివేయాలని కొందరు పిల్ వేశారు. దానిపై విచారించిన సుప్రీంకోర్టు రథయాత్రను నిర్వహించకూడదని జూన్ 18న స్పష్టం చేసింది. ప్రజలకు ఏమైనా జరిగితే ఆ దేవుడు మనల్ని క్షమించడని తెలిపింది. ఐతే ఈ తీర్పును పున: పరిశీలించాలని దాఖలైన పిటిషన్‌లపై ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు.. సోమవారం రథయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

జగన్నాథుడి రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు విధించిన షరతులకు లోబడే రధయాత్రను నిర్వహించాలని తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటు రాష్ట్ర అధికారులతో పాటు అటు ఆలయ సభ్యులతోనూ సమీక్ష నిర్వహించారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు సంబంధించిన అధికారులతో పాటు ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించింది. నకాగా, ఒడిశా వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. ఆదివారం రాష్ట్రంలో 304 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు చనిపోయారు. ఒడిశాలో ఇప్పటి వరకు 5,160 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 3,534 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 14 మంది మరణించారు. ప్రస్తుతం ఒడిశాలో 1,607 యాక్టివ్ కేసులున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagannath Rath Yatra  Jagannath Temple  Puri  Supreme Court  Odisha  covid-19  Corona pandemic  coronavirus  

Other Articles