Consider interest waiver during moratorium: SC సుప్రీంకోర్టు అదేశాలతో కొత్త మారటోరియానికి కొత్తరూపు.!

No benefit from rbis loan moratorium scheme says supreme court

Coronavirus, COVID-19, India covid-19 cases, india coronavirus lockdown, RBI, repayment moratorium of loan repayment, Supreme Court, SBI, housing loan, bank customers, Article 21, deferred loan repayments, coronavirus moratorium, repayments, loans, supreme court, Banks, RBI, companies, business

In the light of coronavirus pandemic, ICICI Lombard, the country’s largest non-life insurer added more benefits for Covid-19 treatment to its existing healthcare insurance indemnity policies. It also reduced the waiting period for coronavirus-related claims to 15 days from 30 days earlier. It said the decreased cooling-off period for Covid-19 patients comes without any increase in premiums.

సుప్రీంకోర్టు అదేశాలతో కొత్త మారటోరియానికి కొత్తరూపు.!

Posted: 06/18/2020 06:05 PM IST
No benefit from rbis loan moratorium scheme says supreme court

కరోనా వైరస్‌ మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశప్రజలకు పలు విడతలుగా ప్రయోజనాలను ప్రకటించింది. ఇందులో మొదటి విడతలోనే బ్యాంకులలో రుణాలు పోందిన రుణగ్రస్తులకు ఉపశమనం అందించింది. అయితే దీనిపై పలు విమర్శలు వచ్చాయి, రుణాలు పోందిన వారు కూడా ప్రభుత్వం కల్పించిన లబ్దిని తాము తీసుకోవాలా.? లేక ఆ కష్టమోదో ఇప్పుడే అనుభవిస్తామని వదులు కోవాలా.? అన్న మిమాంసలో పడ్డారు. ఇందుకు కారణం ఇప్పుడు కల్పించే మారటోరియంపై వడ్డీ వేసి.. చివరిలో కట్టస్తే అది కాస్తా తడిసి మోపడవుతుందని.. ఈ మేరకు లెక్కల మీద లెక్కలేసుకున్న రుణాలు పోందిన వారు ఆలోచనలో పడ్డారు. ఆదాయాలు తగ్గిన తమకు కేంద్ర ప్రకటించిన ప్రయోజనాలు నిష్పలంగా మారుతున్నాయని వాదనలు బలపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రకటించిన మారటోరియంతో రుణాలు పోందిన వారికి ఎలాంటి లబ్ది లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్‌ (ఐబీఏ)ను ఆగస్టు మొదటి వారంలోపు మారటోరియంపై కొత్త నిబంధనలు తీసుకొచ్చే అవకాశాన్ని పరిశీలించాలని సూచించింది. మారటోరియం వ్యవధిలో వడ్డీపై వడ్డీ విధించడం ద్వారా ఆదాయాలు తగ్గిన వారికి లాభమేంటని ప్రశ్నించింది. కేంద్రం ప్రకటించిన మారటోరియంపై ఆర్బీఐతో కలసి మరోసారి పునఃసమీక్షించాలని సూచించింది. ఆరునెలల మారటోరియం వ్యవధిలో వడ్డీపై వడ్డీ విధించడాన్ని సవాలు చేస్తూ ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. దీనిని విచారించిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలు పునఃసమీక్షించాలని సూచించింది.

కాగా, కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. వడ్డీని పూర్తిగా మాఫీ చేయడం బ్యాంకులకు సాధ్యం కాదని అన్నారు. బ్యాంకుల్లోని వున్న డిపాజిట్లకు వడ్డీ చెల్లించాల్సిన బాధ్యత బ్యాంకులపైన ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇది బ్యాంకులు, ఖాతాదారులకు సంబంధించిన అంశంగా పరిశీలించడం సరికాదని.. రుణగ్రహీతలకు మారటోరియం లబ్ది చేకూరేలా చూడాల్సిన బాధ్యత ఉందని సర్వోన్నత్త న్యాయస్థానం పేర్కొంది. ఇక ఎస్బీఐ, ఐబీఏ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది.. 3 నెలల పాటు వాయిదా అడగటంతో న్యాయస్థానం ఆగస్టు మొదటి వారానికి తదుపరి విచారణ చేపడతామని ధర్మాసనం  వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus  COVID-19  coronavirus moratorium  repayments  loans  supreme court  Banks  RBI  business  

Other Articles