Telangana Govt caps prices for Covid tests ప్రైవేటు ల్యాబ్ లలో కరోనా పరీక్షలు.. ఏపీ కన్నా తక్కువే ధరకే..!

Covid 19 telangana fixes rates for testing treatment at private labs and hospitals

coronavirus, covid-19 tests, corona virus test fees, private labs, check on corona test fees, Hyderabad, Andhra pradesh, Telangana, Politics

The State Government on Monday has announced capping of prices to conduct coronavirus diagnostic tests at private laboratories and costs to treat positive patients at corporate hospitals in Hyderabad. It will cost Rs. 2,200 to conduct a single coronavirus test at private laboratories in Hyderabad.

ప్రైవేటు ల్యాబ్ లలో కరోనా పరీక్షలు.. ఏపీ కన్నా తక్కువే ధరకే..!

Posted: 06/15/2020 09:13 PM IST
Covid 19 telangana fixes rates for testing treatment at private labs and hospitals

దేశంలో కరోనా ప్రభావితం బారిన పడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఈ వైరస్ ను పలు ప్రైవేటు అసుపత్రులు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రైవేటు అసుపత్రులకు ధరలను నిర్ణయించింది. కరోనా బారినపడిన వారికి పరీక్షలు నిర్వహించేందుకు ఓ వైపు పోరుగున్న తెలుగు రాష్ట్రంలోని ఏపీ ప్రభుత్వం ఏకంగా రూ. 2900లను నిర్ణయించగా, మహారాష్ట్ర మాత్రం కేవలం రూ.2200లను నిర్ణయించింది. దీంతో మహరాష్ట్ర బాటలోనే పయనించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోనూ ప్రైవేటు ల్యాబుల్లో కరోనా నిర్వహణ చేపట్టేందుకు అనుమతులను ఇచ్చింది.

అంతేకాదు పలు ప్రైవేటు ఆసుపత్రులకు కూడా కరోనా వైరస్ చికిత్స చేసేందుకు అనుమతులు మంజూరు చేసిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. నగరంలోని కరోనా కమాండ్ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ సీఎస్ సోమేష్ కుమార్ సహా ఇతర ఉన్నతాధికారులతో కలసి రాష్ట్రంలోని పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ఆయన ఆనంతర ఈ విషయమై మీడియాతో మాట్లాడిన ఆయన కరోనాపై నిత్యం ఉన్నతస్థాయి సమీక్ష చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఐసీఎంఆర్ ప్రశంసించిందని చెప్పారు.

హైదరాబాద్ నగరంలో సామూహ వ్యాప్తి లేదని ఐసీఎంఆర్ తెలిపిందని చెప్పారు. ఐసీఎంఆర్‌ నిబంధనలు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం పాటిస్తుందని అన్నారు. రాస్ట్రంలో యాభై వేల పరీక్షలు నిర్వహించాలని తాజా అదేశాల నేపథ్యంలోనూ.. కేవలం కరోనా లక్షణాలు వున్నవారికి మాత్రమే పరీక్షలు చేయాలని నిర్ణయించామన్నారు. ఐసీఎంఆర్ తమకు ఈ మేరకు నిబంధనలు జారీ చేసిందని చెప్పారు, లక్షణాలు లేనివారికి పరీక్షలు చేయడం లేదన్నారు. కరోనా లక్షణాలు లేని వాళ్లు తప్పకుండా హోం ఐసోలేషన్‌ పాటించాలని మంత్రి కోరారు. కాగా ప్రభుత్వ చర్యల వల్లే రాష్ట్రంలో కేసులు ఎక్కువగా రావడం లేదని వివరించారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స ధరలు ఇలా:-

 

* ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర : రూ.2,200

* సాధారణ చికిత్సకు రోజుకు రూ.4 వేలు

* వెంటిలేటర్‌పై లేకుండా ఐసీయూలో ఉంచితే రోజుకు రూ.7,500

* వెంటిలేటర్‌పై ఉంటే రోజుకు రూ.9 వేలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19 tests  corona virus  Telangana  Politics  

Other Articles