Anam unhappy with YSRCP rule అధికారగణంపై అసంతృప్తి.. గళం విప్పిన అనం రామనారాయణ రెడ్డి

Anam ramanarayana reddy threatens to launch stir

Anam Ramanarayana Reddy, District Administration, Venkatagiri, state officials, development activities, Nellore, YSRCP, YCP government, YS Jagan, Chief Minister, AP CM YS Jagan, Andhra Pradesh, politics

Former minister, Venkatagiri MLA Anam Ramanarayana Reddy lambasted the district administration for neglecting the development of his constituency. Ramanarayana Reddy threatened that he would launch agitation if the district administration continues to neglect his constituency in implementing development works.

అధికారగణంపై అసంతృప్తి.. గళం విప్పిన అనం రామనారాయణ రెడ్డి

Posted: 06/04/2020 06:42 PM IST
Anam ramanarayana reddy threatens to launch stir

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికారుల తీరుపై అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యే అసంతృప్తి గళం వినిపించారు. రాష్ట్రంలో ఏడాది పాలన పూరైన సందర్భంగా కేకులు కట్ అవుతున్నాయని, అయితే ఆ మేరకు కనీస ‘అభివృద్ధి మాతరం జరగడం లేదని అసంతృప్తిని వెళ్లగక్కారు. అభివృద్ది పనులపై తాను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వివరించి లేఖ రాశానని, వాటిని పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించినా.. ఇప్పటికీ వాటిపై ఎలాంటి స్పందన లేదని.. అసలు తాను రాసిన లేఖ ఎక్కడుందో కూడా తెలియదని మాజీ మంత్రి, వెంకటగిరి వైసీపి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.

అధికారుల తీరులో ఇప్పటికైనా మార్పు రావాలని సూచించిన ఆయన.. అలా రానీ పక్షంలో తానే అధికారగణానికి వ్యతిరేకంగా దీక్షకు కూర్చుంటానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధిపై లేఖలు, నివేదికలు ఇవ్వడానికే తాను ఏడాది సమయాన్ని కేటాయించానని.. ఇకపై వీటన్నింటినీ పరిష్కారించేందుకు ముందుకు కదలుతానని అన్నారు. అవసరమైతే అధికారులను ఎక్కడికక్కడ నిలదీయడానికి కూడా తాను వెనుకడుగు వేయనని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలోని తన నియోజకవర్గంలో రామనారాయణరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రాక ముందే 100 పడకల ఆసుపత్రి, డయాలసిస్‌ కేంద్రం, ట్రామా కేర్‌ సెంటర్లు, ఆసుపత్రులు నిర్మించాలని డిమాండ్ చేశారు.

తన నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరినా అధికారుల నుంచి ఇప్పటికీ సమాధానం రాలేదని అన్నారు. సీఎం ప్రకటించే సంక్షేమ కార్యక్రమాలు వాలంటీర్ల ద్వారా ప్రజలకు చేరుతున్నాయి తప్ప.. నేరుగా నియోజకవర్గానికి ఒక్క రూపాయి తీసుకువచ్చి అభివృద్ధి చేయలేకపోయానని ఆయన అవేధన వ్యక్తం చేశారు. ప్రజలకు సంక్షేమం అవసరమే.. అయితే నియోజక అభివృద్ది అన్నది సమిష్టి అవసరం అని అన్నారు. తమ నియోజకవర్గంలోని వెంకటగిరి మున్సిపాలిటీలో రోడ్డు, కాలువ, శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి తాను స్వయంగా ప్రాజెక్టు రిపోర్టు ఇచ్చినా.. ఇప్పటికీ ఒక్క రూపాయి మంజూరు కాలేదని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles