One more succumbs to LG Polymers gas leak ఎల్జీ పాలీమర్స్ ఘటనలో మరోకరి మృతి..

Vizag gas leak panel for prosecution of lg polymers under crpc

LG Polymers, gas leak, LG Polymers plant, styrene gas, styrene gas leak, toxicity, polymer factory, Visakhapatnam, National Green Tribunal, NGT, Companies Act, vizag gas leak, Supreme Court, AP HIgh Court, Andhra Pradesh, Politics

A five-member Joint Monitoring Committee (JMC), headed by Justice Seshasayana Reddy, submitted its 168-page report on LG Polymers gas leak to the National Green Tribunal (NGT), citing reasons which include human negligence and security lapses, that led to the industrial mishap.

ఎల్జీ పాలీమర్స్ ఘటనలో మరోకరి మృతి.. మానవ తప్పిదమేనన్న కమిటీ

Posted: 06/02/2020 08:52 PM IST
Vizag gas leak panel for prosecution of lg polymers under crpc

విశాఖపట్నం పరిధిలోని ఆర్‌.ఆర్‌ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌ సంస్ధ లో గ్యాస్ లీకైన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఈ దుర్ఘటనలో 11 మంది అప్పుడే చనిపోగా ఇద్దరు చికిత్స పోందుతూ మరణించారు. కాగా తాజాగా ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స అనంతరం కోలుకున్న వెంకటాపురం గ్రామానికి చెందిన యలమంచిలి కనకరాజు (45) మరణించాడు. వృతిరిత్యా కార్పెంటర్ అయిన కనకరాజుకు భార్య, కుమారుడు ఉన్నారు. దీంతో స్థానికుల్లో మళ్లీ అందోళనకు గురయ్యారు. భవిష్యత్తులో తమ అరోగ్యాలకు కంపెనీవారు భరోసా ఇవ్వాలని.. ఏ అనారోగ్యం ఎదురైనా దానికి వారే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

గత నెల ఏడో తేదీన గ్యాస్ లీక్ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన కనకరాజు అప్పటి నుంచి అసుపత్రిలోనే చికిత్స పోందాడు. ఆ తరువాత ఇటీవల కోలుకుని అసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యి ఇంటికి చేరుకున్నాడు. అయితే, గత రెండు రోజులుగా ఆయాసం, కడుపు ఉబ్బరంతో శ్వాస పీల్చుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. అతడి మరణానికి స్టైరీన్ విష వాయువే కారణమని, బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని గ్రామస్థులు, నాయకులు డిమాండ్ చేశారు. కాగా, కనకరాజు మృతితో ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 14కు పెరిగింది.

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి ఘటనపై ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్) విచారణ కమిటీ పరిశీలనలో కీలక అంశాలను గుర్తించారు. తన నివేదికలో ఎల్జీ పాలిమర్స్ నిర్లక్ష్యం, తప్పిదాలను కమిటీ ఎత్తిచూపింది. ముఖ్యంగా, ఐదు కీలక తప్పిదాలను కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది.

1. అత్యల్ప ఉష్ణోగ్రతల్లో స్టైరీన్ పాలిమరైజేషన్ ను నిలువరించే టీబీసీ స్టోరేజి తగినంతగా ప్లాంట్ లో అందుబాటులో లేదు.

2. ప్లాంట్ లో ఆక్సిజన్ ను ఆవిరిగా మార్చే క్రమంలో మానిటరింగ్ సిస్టమ్ ను అమలు చేయడంలేదు.

3. స్టైరీన్ స్టోరేజి ట్యాంకు టాప్ లేయర్లలో ఉష్ణోగ్రతలను పర్యవేక్షణ చేసే వ్యవస్థను పాటించడంలేదు.

4. ప్లాంట్ లో రిఫ్రిజరేషన్ వ్యవస్థను 24 గంటల పాటు ఆపరేట్ చేయడంలేదు.

5. ప్లాంట్ లోనూ, స్టోరేజి ట్యాంకు వద్ద పర్సన్ ఇన్ చార్జిల నిర్లక్ష్యం, తప్పిదం స్పష్టంగా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles