YCP MLA nallapureddy challenges nellore sp an collector కలెక్టర్, ఎస్సీలకు నల్లపురెడ్డి ఛాలెంజ్.. ‘‘అరెస్టు చేసి లోపలేయండీ..’’

Ycp mla nallapureddy prasannakumar reddy challenges nellore sp an collector

Nellore district, YSR Congress Party MLA from Kovur Nallapareddy Prasanna Kumar Reddy, nallapareddy prasanna kumar reddy sensational comments, controversy over violation of social distancing norm, notices to field-level government staff, Andhra Pradesh, Politics

ysrcp mla nallapureddy prasanna kumar reddy made sensational comments on nellore district collector and superintendent of police, by challenging them to arrest him and put him in jail for violating the lockdown terms.

కలెక్టర్, ఎస్సీలకు నల్లపురెడ్డి ఛాలెంజ్.. ‘‘అరెస్టు చేసి లోపలేయండీ..’’

Posted: 05/02/2020 06:29 PM IST
Ycp mla nallapureddy prasannakumar reddy challenges nellore sp an collector

వైసీపీ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జిల్లా అధికారులపై ఒంటికాలిపైన లేచారు. లాక్ డౌన్ నేపథ్యంలో తాను సామాజిక దూరం నిబంధనలు పాటించలేదని పేర్కోంటూ నోటీసులు జారీ చేసిన అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్, ఎస్పీలు ఏసీ గదుల్లో కూర్చుని పాలన చేస్తున్నారని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా వారికి తెలియదన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే తనను అరెస్ట్ చేయాలని.. తాను ఎక్కడికి పారిపోలేదని.. పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాని అన్నారు. ఎస్పీని తాను అసలు లెక్క చేయనని.. కలెక్టర్, ఎస్పీ తమ మర్యాదను కాపాడుకోవాలన్నారు.

రాజకీయాలు చేయాలంటే పార్టీలో చేరాలని.. సూచించిన ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు రూల్స్ నేరిపిస్తారా.. తాను ఏసీ గదులకు పరిమితమైన వారివద్ద పాఠాలు నేర్చుకోవాలా అని ప్రశ్నించారు. రూల్స్ పాటించాలని తనకు సూచించినవారు.. జెడ్పీలో యాబై వంద మందితో మీటింగ్ ఎలా పెడతారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. నిత్యావసర వస్తువుల పంపిణీకి తానే అధికారుల్ని ఆహ్వానించానని.. మరి వారికి నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అధికారులపై చర్యలు తీసుకుంటే తాను ఎంతకైనా తెగిస్తానని.. తానేంటో చూపిస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నెల్లూరు జిల్లా కోవూరు అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి కొద్దిరోజుల క్రితం నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సామాజిక దూరం పాటించకపోవడంతో జిల్లా ఎస్పీ భాస్కర్‌ భూషణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు గుంపులుగా చేరేందుకు కారణమైనందుకు, నిబంధనలు అతిక్రమించారనే ఆరోపణలతో ఎమ్మెల్యే నల్లపురెడ్డితో పాటు మరో ఏడుగురుపై 148, 188, 269, 270, 271 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై అగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ధర్నాకు దిగారు, పోలీసుల వైఖరికి నిరసనగా తన అనుచరులతో కలిసి బుచ్చిరెడ్డిపాలెం పోలీసు స్టేషన్‌ ఎదుట ఎమ్మెల్యే ధర్నా చేపట్టారు. స్వయంగా ఎస్పీ వచ్చి తమను అరెస్టు చేస్తే కానీ అక్కడి నుంచి కదలనని బైఠాయించారు, ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సముదాయించారు,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles