Delhi Police performs last rites of Uttar Pradesh dead man అపత్కాలంలో పోలీసులే బంధువర్గమై.. అంతిమ సంస్కారాలు..

Lockdown delhi police performs last rites of man as family was unable to reach

Delhi Police, Last rites, Gorakpur Man, deceased wife, deceased family, chiken pox, DCP Northwest delhi, Vijayanta Arya, Death certificate, Top News, Latest News, New Delhi, dehli police last rites of deceased, delhi, crime

Delhi Police performed the last rites of a man whose family was unable to take his dead body back to their hometown due to the nationwide lockdown, The man died on April 13 and the body was in the hospital for 10 days. He was a resident of Gorakhpur and died due to chickenpox.

అపత్కాలంలో పోలీసులే బంధువర్గమై.. అంతిమ సంస్కారాలు..

Posted: 04/24/2020 11:01 AM IST
Lockdown delhi police performs last rites of man as family was unable to reach

మానవాళి మనుగడకు సవాల్ విసురుతూ వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. అయితే లాక్ డౌన్ వేళల్లో అధిక శ్రమకు ఓర్చుతున్న పోలీసుల్లో తాము రక్షకభటులం అన్న.. అందులోనూ ప్రజలకు రక్షణ కల్పించడంలో వారి సమస్యలను పరిష్కరించడంలోనూ ముందుంటామని చాటుతున్నారు. ఇక కరోనా నేపథ్యంలో దేశప్రజలందరూ ఇళ్లకు మాత్రమే పరిమితం అవుతున్న క్రమంలో వారు మాత్రం అసుపత్రులకు వెళ్లే రోగులను, బయటకు వచ్చే రోగులను చూస్తూ.. మనిషి ప్రాణం విలువకు పరమార్థం పోలీసులకు బాగా తెలిసివచ్చింది.

ఈ నేపథ్యంలో బడాబాబుల నుంచి సామాన్యుడి వరకు అందరికీ తాము అండగా నిలిచేందుకు పోలీసులు దోహదపడతున్నారు. ఇలాంటి అపత్కాల సమయంలో వారిలో మానవత్వం వెల్లివిరిసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఏప్రిల్ 13వతేదీన ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ నగరవాసి ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికెన్ ఫాక్స్ వ్యాధితో మరణించాడు. గోరఖ్ పూర్ వాసి ఢిల్లీ ఆసుపత్రిలో మరణించి పది రోజులు దాటినా అతని మృతదేహం ఆసుపత్రి మార్చూరీలోనే మగ్గుతోంది. దీంతో ఈ విషయాన్ని పోలీసులు కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు.

ఆ తరువాత పోలీసులే కుటుంబసభ్యులై సంప్రదాయబద్దంగా అ మృతదేహానికి అంత్యక్రియలు జరిపేంచారు. లాక్ డౌన్ నేపథ్యంలో మృతదేహాన్ని గోరఖ్ పూర్ పంపించడం సాధ్యపడే పని కాదు. అలాగని మృతుడి కుటుంబసభ్యులు గోరఖ్ పూర్ కు చేరుకునే పరిస్థితులు లేవు. దీంతో విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చిన పోలీసలకు మృతుడి భార్య ఓ విన్నపాన్ని కోరింది. తన భర్త మృతదేహానికి శాస్త్రోక్తంగా దహనసంస్కారాలను చేయాలని కోరింది. దీంతో ఢిల్లీ పోలీసులు ముందుకు వచ్చి మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకువెళ్లి సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపారు. లాక్‌డౌన్ వల్ల తమ పోలీసులే అంత్యక్రియలు జరిపారని డీసీపీ విజయంత్రా ఆర్యా చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles