Minister Etela clariffies on Corona cases in Telangana తెలంగాణ కరోనా కేసులపై మంత్రి ఈటెల క్లారిటీ..

Coronavirus telangana minister etela rajender clariffies on corona cases in state

etela rajender, telanagana corona virus, telangana covid-19, vikarabad, sryapet, Hyderabad, Gandhi Hospital, lockdown impact, CM KCR, coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamuddin event Telangana

The Telangana government on Thursday said that it is taking all measures to control the spread of coronavirus in the state. Minister Etela Rajender in a press conference today said that breaking of corona link is in control.

తెలంగాణ కరోనా కేసులపై మంత్రి ఈటెల క్లారిటీ..

Posted: 04/23/2020 08:14 PM IST
Coronavirus telangana minister etela rajender clariffies on corona cases in state

తెలంగాణలో గత 24 గంటల్లో 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వీటిలో 13 కేసులు హైదరాబాద్‌లోనే నమోదు కాగా, 10 కేసులు జోగులాంబ జిల్లాల్లో నమోదయ్యాయన్నారు. మొత్తం కేసుల సంఖ్య 970కి చేరిందన్నారు. గురువారం యంత్రం మీడియాతో మాట్లాడిన ఈటల.. ఈ రోజు ఉదయం కరోనాతో ఒకరు చనిపోయారని.. దీంతో తెలంగాణలో కోవిడ్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 25కు చేరిందని ఈటల తెలిపారు. గురువారం 58 మంది డిశ్చార్జ్ అయ్యారన్నారు. ఇ

ఇప్పటి వరకూ మొత్తం 266 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 693 ఉన్నాయని.. వీరిలో ఎవరికీ సీరియస్‌గా లేదని మంత్రి తెలిపారు. సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలపై సీఎం ఆదేశించారని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు విఘాతం కలగకుండా చూడాలని సీఎం ఆదేశించారన్నారు. ఇప్పటికే సీఎం అదేశఆల మేరకు సీఎస్, డీజీపీలు ఈ ప్రాంతాలలో పర్యటించి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్న సమాచారం అందించారని తెలిపారు.

గాంధీ హాస్పిటల్ సమస్యల విషయమై సూపరింటెండెంట్‌తో మాట్లాడామన్నారు. అపత్కాల సమయంలో అందరూ సహకరించాలని కోరారు. కరోనా కేసులు రెట్టింపు కావడానికి దేశంలో 7.5 రోజులు పడుతుంటే.. తెలంగాణలో 12.5 రోజులు పడుతుందన్నారు. భారత సగటు డెత్ రేట్ 3.18 శాతం ఉండగా.. తెలంగాణలో 2.6 శాతం ఉందన్నారు. రికవరీ రేట్ దేశంలో 19.9 శాతంగా ఉంటే.. మన దగ్గర 22 శాతం ఉందన్నారు. అయితే ఈ కేసులు పూర్తిగా నియంత్రించేందుకు ప్రజలు కూడా లాక్ డౌన్ పాటించి సక్రమంగా పాటించాలని మంత్రి ఈటెల కోరారు.

ధీ ఆసుపత్రిని మొత్తం 6 యూనిట్లుగా విభజించాలని, ప్రతి యూనిట్‌కి ఒక ప్రొఫెసర్‌ను బాధ్యుడిగా నియమించాలని మంత్రి ఈటల వివరించారు. ఆస్పత్రిలోని ఈ ఆరు యూనిట్లలో రోగులు సమానంగా ఉండేలా పర్యవేక్షించాలని ఆయన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను డాక్టర్ రాజారావును ఆదేశించారు. కరోనా పాజిటివ్ వ్యక్తుల చేరికలు, చికిత్స జరుగుతున్న తీరు, కరోనా పరీక్షలు, రోగుల డిశ్చార్జ్‌ తదితర అంశాలపై ఆయన కోఠిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో గురువారం సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఈటల మాట్లాడారు.

గాంధీ ఆస్పత్రిలో కేవలం కరోనా పాజిటివ్ పేషంట్లు మాత్రమే ఉన్నందున.. వైరస్ వ్యాప్తి జరగకుండా వైద్య సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా డాక్టర్‌లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది కచ్చితంగా పీపీఈ కిట్లను ధరించాలని నిర్దేశించారు. ప్రతి కరోనా పేషెంట్‌ను ఉదయం సాయంత్రం పరీక్ష చేయాలని, డయాబెటిస్, బీపీ ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. అత్యవసర ఆరోగ్య సేవలు కావాల్సిన వారికి తక్షణ వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Etela Rajender  coronavirus  vikarabad  sryapet  Hyderabad  Gandhi Hospital  lockdown impact  CM KCR  Telangana  Politics  

Other Articles