'AP at forefront in fight against COVID' ఆంధ్రప్రదేశ్ లో కమ్యూనిటీ వ్యాప్తి ప్రాథమిక దశ

Experts hint at community spread in andhra situation under control

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates,

The spread of COVID-19 in Andhra Pradesh is under control, and the government is taking all precautions to face any eventuality, Special Chief Secretary KS Jawahar Reddy asserted, adding that experts say the State is witnessing the initial stages of community transmission of coronavirus.

ఆంధ్రప్రదేశ్ లో కమ్యూనిటీ వ్యాప్తి ప్రారంభమైంది.. ప్రస్తుతం ప్రాథమిక దశ..

Posted: 04/08/2020 03:29 PM IST
Experts hint at community spread in andhra situation under control

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతోనే అందోళన చెందుతున్న రాష్ట్ర ప్రజలకు మరో పిడుగులాంటి వార్త కలవరపాటుకు గురచేస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ స్టేట్ 3కి వెళ్లిందని.. దీంతో కమ్యూనిటీ స్ప్రెడ్ కూడా జరుగుతుందన్న వార్తతో ప్రజలు భాయందోళనకు గురవుతున్నారు. అయితే ప్రస్తుతం సామాజిక వ్యాప్తి ప్రాథమిక స్థాయిలో ఉందని వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు.

రాబోయే రోజుల్లో 2-3 లక్షల ర్యాపిడ్‌ టెస్ట్‌లు చేసేందుకు సంకల్పించామని, దీంతో కమ్యూనిటీ వ్యాప్తిపై అవగాహన వస్తుందని ఆయన తెలిపారు. ఇక ఈ నెల 14 తర్వాత లాక్ డౌన్‌ ను కేంద్రం ఎత్తివేసినా.. రాష్ట్రంలో మాత్రం పూర్తిగా ఎత్తేయడం కుదరదని చెప్పారు. విజయవాడ, గుంటూరు లాంటి హాట్ స్పాట్ లలో ఆంక్షలు కొనసాగుతాయని జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో  కొవిడ్‌ లక్షణాలతో ఉన్నవారిని గుర్తించేందుకు ప్రత్యేకసర్వే చేశామన్నారు. 5వేల మందిని గుర్తించామని చెప్పారు. వారిలో 1800-2000 మందికి పరీక్షలు అవసరమని గుర్తించామన్నారు

కమ్యూనిటీ పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్ లనూ సంప్రదిస్తున్నామన్నారు. వీటితో పాటు టీబీ పరీక్షలు చేసే ట్రూనాట్‌ సెంటర్లలో కరోనా పరీక్షలు చేయొచ్చని ఐసీఎంఆర్‌ చెప్పిందని అన్న జవహార్ రెడ్డి.. ఇందుకోసం 240 ట్రూనాట్‌ సెంటర్లును కూడా వినియోగించనున్నామన్నారు, 20 లక్షల పీపీఈలు, 14 లక్షల ఎన్‌-95 మాస్క్‌లు సిద్ధం చేస్తున్నాం. 40లక్షల గ్లోవ్స్‌, 12 లక్షల సర్జికల్‌ మాస్క్‌లు ఉన్నాయి. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలు 20 లక్షలు, అజిత్రోమైసిన్‌ 14 లక్షలు సిద్ధంగా ఉంచామన్నారు. ఈ కాంట్రాక్టు, ఔట్ సోర్పింగ్ విధానంలో ప్రస్తుతం సేవలు అందిస్తున్న వారికి భవిష్యత్తులో జరిగే ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యం కల్పిస్తామన్నారు,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles