Liquor shops to be closed upto April 14th తెలంగాణలో 14 వరకు మద్యం దుకాణాలు బంద్.!

Liquor shops and bars to be closed in telangana upto april 14th

Coronavirus, coronavirus scare, coronavirus, karnataka coronavirus jds, JDS MLA grandson, JDS MLA defies lockdown, coronavirus in India, grandson JDS leader, S Srinivas, Gubbi, grandson srinivas mla, India, Politics

Telangana Excise Police had issued latest orders as the recent G.O which was bought into force has been void yesterday. The new G.O says all the wine shops and Bars in the state to be closed uptill 14 of April.

కరోనా వైరస్: తెలంగాణలో 14 వరకు మద్యం దుకాణాలు బంద్.!

Posted: 04/01/2020 07:31 PM IST
Liquor shops and bars to be closed in telangana upto april 14th

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 7 తరువాత తెలంగాణలో కరోనా ప్రభావం అసలు వుండదని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అంచనా వేశారు. అయితే ఆ అంచనాలను ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గోనేందుకు రాష్ట్రం నుంచి వెళ్లిన వెయ్యి మందితోనే రాష్ట్రంలో కేసులు సంఖ్య పెరడగంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఇక ఏప్రిల్ 15 వరకు తెలంగాణలో లాక్ డౌన్ ఇప్పటికే కొనసాగుతున్న నేపథ్యంలో దీనిని మరింత పెంచాల్సిన అవసరంపై కూడా ప్రభుత్వం సమీక్షిస్తోంది.

అయితే లాక్ డౌన్ పొడగించే విషయంలో తుది నిర్ణయం తీసుకోని ప్రభుత్వం ఇకపై పొడగింపును పెరుగుతున్న కేసులను సమీక్షించిన తరువాతే నిర్ణయం తీసుకోనుందని సమాచారం. తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో ఈ విషయం బయటకు వచ్చింది. తెలంగాణలో ఈ నెల 14 వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసే ఉంచాలంటూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం దుకాణాల మూసివేత గడువు నిజానికి నిన్నటితో ముగిసింది. దీంతో ఈ రోజు తెరిచే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి.

కాగాకరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మద్యం షాపులను మరికొన్ని రోజులపాటు మూసి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే నిన్న గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇదే సమయంలో తెలంగాణలో మద్యం దుకాణాలు తెరుచుకోబోతున్నాయంటూ నకిలీ జీవో సృష్టించి.. దానిని వాట్సాఫ్ ద్వారా విపరీతంగా వైరల్ చేసిన వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పల్ కు చెందిన కె.సనీష్ కుమార్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ నెల 28న సోషల్ మీడియాలో మద్యం దుకాణాలు తెరుచుకోబోతున్నాయన్న పోస్టును చూశాడు.

దీనిని కాపీ చేసిన సనీష్.. ప్రభుత్వ జీవోలా దానిని మార్చి మద్యం వ్యాపారి అయిన తన స్నేహితుడు గౌడ్ కు పంపించాడు. అది చూసి నిజమేనని నమ్మిన ఆయన మరికొందరికి పంపించాడు. దీంతో కొన్ని గంటల్లోనే వందలమందికి షేర్ అయింది. ఈ నకిలీ జీవోను చూసిన చాలామంది అబ్కారీ అధికారులకు ఫోన్ చేసి ఈ విషయమై ఆరా తీశారు. స్పందించిన ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైం పోలీసులు దీనికి సూత్రధారి సనీష్ అని తేల్చారు. స్నేహితుడికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉంటాడని నిర్ధారించారు. నిన్న అతడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19  Liquor Shops  Bars  Fake G.O  Abkari Act  Navish  Satish Goud  Excise Department  Telangana  Crime  

Other Articles

Today on Telugu Wishesh