SC Judges Pitch In With Virus Relief ఆర్తులను ఆదుకునేందుకు కదిలిన సుప్రీంకోర్టు జడ్జీలు

Coronavirus alert supreme court judges pitch in with virus relief

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Supreme Court. Justice nv ramana, S Ravindra Bhatt, Delhi High Court, pm cares fund, rakesh dwivedi, daily labour, chief secretaries all states, coronavirus, coronavirus lockdown 21, courts, covid19, justice nv ramana, justice ravindra bhat, migrant workers, supreme court, coronavirus updates, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus live update india, coronavirus in india new delhi, dialy labour, coronavirus in india latest news

A day after Supreme Court Justice Sri N.V. Ramana donated Rs. Three Lakh to the relief funds in wake of the Corona Outbreak, another apex court judge, Justice Ravindra Bhat offered aid to migrant workers.

ఆర్తులను ఆదుకునేందుకు కదిలిన స్వరోన్నత న్యాయస్థాన న్యాయమూర్తులు

Posted: 03/31/2020 02:57 PM IST
Coronavirus alert supreme court judges pitch in with virus relief

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే రోజు వారి కూలీలు, వలస కార్మికులు వీధిన పడ్డారు.  సొంత ఊళ్లకు వెళ్లలేక ఉన్నచోట  ఆహరం దొరక్క నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ సమయంలో దేశ సర్వెన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మేము సైతం అంటూ కదిలారు. అత్యున్నత న్యాయస్థానానికి చెందిన పలువురు న్యాయమూర్తులు తమకు తోచిన విధంగా సహయం అందించారు. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా భావిస్తున్న జస్టిస్ ఎన్.వీ.రమణ  ప్రధాన మంత్రి సహాయనిధితో పాటు, ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి  ఒక్కో లక్ష రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు.  

వీరికంటే ఒక అడుగు ముందడుగు వేసి మరొక సుప్ర్రీం కోర్టు న్యాయమూర్తి ఎస్.రవీంద్ర భట్ ఢిల్లీ వీధుల్లోని వలస కూలీలకు ఆహారం ప్యాకెట్లను పంపిణీ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో అన్నం లేక.. నిత్యవసర సరుకులు లభ్యం కాక.. అన్నార్తులు అకలితో అలమటిస్తున్న విషయం తన దృష్టికి వచ్చిన నేపథ్యంలో తీర్పులు, అదేశాలకు మత్రమే పరిమితం కాని న్యాయమూర్తి తనవంతుగా వలసకూలీలకు అన్నం ప్యాకెట్లను అందజేశారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది  కరోనై వైరస్ వ్యాధిని ఎదుర్కోటానికి ఏర్పాటు చేసిన పీఎం కేర్ ఫండ్ కి  కోటి రూపాయలు విరాళం అందచేసి లాక్ డౌన్ వల్ల ప్రభావితమైన బలహీన వర్గాల వారికి అండగా నిలిచారు. ప్రతి న్యాయమూర్తి తమ జీతాల్లోంచి 10 వేల రూపాయలను పీఏం కేర్ ఫండ్ కు విరాళంగా అందిస్తారని  ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది.  

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, ఢిల్లీ  హైకోర్టుకు చెందిన సబార్డినేట్ సిబ్బంది కూడాల ఒకరోజు జీతాన్ని స్వచ్చందంగా అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను పాటిస్తూ .... తగిన రక్షణ చర్యలు తీసుకుని సామాజిక దూరాన్ని పాటించాలని జస్టిస్ రమణ ప్రజలకు పిలుపునిచ్చారు. లాక్ డౌన్  విధించేసరికి వేలాది మంది వలసదారులు ఢిల్లీ వీధుల్లో ఆహరంలేక...సొంతూళ్లకు వెళ్లలేకు అల్లాడి పోయారు. అలాంటి వారికి భట్ ఆహారాన్ని అందించి సహయ పడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి తమ,తమ ఊళ్లకు వచ్చేవారు  తప్పని సరిగా క్వారంటైన్ లో ఉండాల్సిందేనన్న నిబంధనను పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles