60 year old man starves to death in Hyderabad హైదరాబాదులో ఆకలి చావు.. క్షుద్భాధతో వృద్దుడి మృతి

60 year old man starves to death in hyderabad amid coronavirus lockdown

corornavirus, covid -19, Food, starvation, Lock Down, Humayun nagar, mehdipatnam, Hyderabad, Old man, Hunger death, Death, country with most coronavirus cases ,China, Johns Hopkins University ,US coronavirus cases ,Donald Trump,covid-19 pandemic,Italy,America, masks, coronavirus masks, New york, covid masks, which mask to use,, New york coronavirus, spain coronavirus Karnataka, coronavirus news, coronavirus hyderabad, coronavirus in tamil nadu, coronavirus cases, coronavirus live update india, coronavirus in india, coronavirus in india latest news

An 60-year-old Man died of hunger at Humayun Nagar in Mehdipatnam area of Hyderabad, Telanagana on March 30. The report sought to link the alleged hunger death to the ongoing nationwide lockdown to contain the spread of coronavirus.

హైదరాబాదులో ఆకలి చావు.. క్షుద్భాధతో వృద్దుడి మృతి

Posted: 03/30/2020 09:15 PM IST
60 year old man starves to death in hyderabad amid coronavirus lockdown

కరోనా వైరస్‌ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ తరుణంలో పరోక్షంగా కూడా దీని ప్రభావం బారిన పడి పలువురు మరణిస్తున్నారు. కొందరు ఈ భయంకర మహమ్మారి గురించి తెుసుకుని అందోళన చెందిన మరణించగా, మరికొందరు దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో ఆకలికి తట్టుకోలేక అలమటించి మరణిస్తున్నారు. లాక్ డౌన్ తో యావత్ దేశంలో అన్నింటికీ తాళాలు పడ్డాయి. జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడిక్కడే ప్రజా రవాణా నిలిచిపోయింది. కేవలం నిత్యావస సరకులు, అత్యవసరం సేవలు మినహా అన్ని నిలిచిపోయాయి.

ఈ నేపథ్యంలో అనుహ్యంగా తెరపైకి వచ్చిన ఈ పరిణామాలతో రాష్ట్రంలో వున్న వలస కూలీలు, అభాగ్యులు, పేదలు, బీదలు, యాచకులు సహా పలువురు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిని ఆదుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. పలు స్వచ్చంద సంస్థలు ముందుకొచ్చి అభాగ్యుల ఆకలిని తీరుస్తున్నారు. ఈ తరుణంలోనే క్షుద్భాధకు తాళలేక ఓ ఓ వృద్ధుడు మరణించాడు. ఈ విషాద ఘటన ఎక్కడో మారుమూల గ్రామంలో జరగలేదు. అంతర్జాతీయ నగరంగా బాసిల్లుతున్న హైదరాబాద్ నడిబొడ్డున చోటు చేసుకుంది.
 
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే,, మెహదీపట్నం ప్రాంతంలోని హుమాయిన్ నగర్ లో 60 సంవత్సరాలున్న ఓ వృద్ధుడు ఫుట్ పాత్ పైపడి సృహకోల్పోయి ఉన్నాడు. అచేతనంగా వున్న ఆ వృద్దుడిని.. ఇవాళ ఉదయం ఈ ప్రాంతం గుండా వెళ్తున్న పోలీసులు గుర్తించారు. అతని వద్దకు వెళ్లగా.. సార్ చాలా ఆకలిగా వుంది.. ఏమైన తెచ్చిపెట్టండీ అని అడిగాడు. దీంతో చలించిపోయిన పోలీసులు.. అతడికి ఏమైనా అందించాలని వెళ్లారు. స్థానికంగా అన్ని బంద్ కావడంతో చివరాఖరకు పండ్లు తీసుకువచ్చారు. అయితే వారు తిరిగిరావడం కాసింత ఆలసమయ్యిందో ఏమో వృద్దుడు అప్పటికే పూర్తిగా నిరసించి సృహకోల్పోయాడు.  

పోలీసులు అతన్ని అసుపత్రికి తరలించగా, అతడు మరణించాడని అక్కడి వైద్యులు తెలిపారు. తన తుది కోరిక కూడా తీరకుండానే వృద్దుడు ప్రాణాలు వదలడం పోలీసుల గుండెలను కూడా కదిలించింది. చివరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా ఈ ఘటన కలిచివేసింది. ఇతను గతకొన్ని రోజులుగా ఫుట్ పాత్ పైనే ఉంటున్నాడని, ఆకలితో అలమటిస్తున్నాడని సమాచారం. ఇతను ఎక్కడి వాడు ? ఇతరత్రా వివరాలు తెలియాల్సి ఉంది. ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులకు ఆదుకునేందుకు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చినా ఈ మరణం చోటుచేసుకోవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : corornavirus  covid -19  Food  starvation  Lock Down  Humayun nagar  mehdipatnam  Hyderabad  Old man  Hunger death  Death  Telangana  

Other Articles

Today on Telugu Wishesh