Pawan Kalyan donates Rs 2 crores to fight against coronavirus కరోనా వైరస్ పై పోరుకు పవన్ కల్యాణ్ సాయం

Coronavirus outbreak pawan kalyan donates rs 50 lakh each to andhra pradesh and telangana government

Pawan Kalyan, Coronavirus, coronavirus scare, pawan kalyan donation, pawan kalyan coronavirus, covid-19, Andhra Pradesh, Telangana, Cm relief fund, PM relief fund, India, Politics

Powerstar Pawan Kalyan is currently in self-isolation at his home in Hyderabad. The actor, who is also a full-time politician. has donated a sum of Rs 2 crore to Chief Minister and Prime Minister's relief fund to fight against the novel coronavirus.

కరోనా వైరస్ పై పోరుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సాయం

Posted: 03/26/2020 10:59 AM IST
Coronavirus outbreak pawan kalyan donates rs 50 lakh each to andhra pradesh and telangana government

తన అభిమానులకే కాదు ప్రజలెవరికి కష్టం వచ్చినా.. అందులోనూ మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడు ఇబ్బందులను ఎదుర్కొన్నా.. తనవారంటూ వారిని కష్టాల కడలి నుంచి దాటించేందుకు తనవంతుగా సాయం చేయడానికి ముందుకు వచ్చే సినీనటుడు.. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహహ్మారి నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వాలు చేస్తున్న కృషిని ప్రశంసిస్తూనే తన వంతు సాయంగా ఏకంగా రెండు కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు.

దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కోంటున్న ఈ మహమ్మారిని పారద్రోలేందుకు.. ప్రధాని సహాయ నిధికి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో తనవంతు భాగస్వామ్యం కోసం ఈ నిధులు అందజేస్తున్నట్లు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 21 వేల మందిని ప్రాణాలను బలితీసుకున్న ఈ మహమ్మారిని దేశంలో నియంత్రించేందుకు పవన్‌ కల్యాణ్ కాసేపటికే ప్రధాని సహాయ నిధికి కూడా రూ.కోటి విరాళం ప్రకటించారు. ‘ఈ కష్టకాలంలో ప్రధాని మోదీకి బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది. ఆయన నాయకత్వం, స్ఫూర్తిదాయక చర్యలు ఈ కష్టం నుంచి దేశాన్ని గట్టెక్కించగలవని నమ్ముతున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు.

కరోనా వైరస్ వ్యాపించకుండా, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని, నిత్యమూ పోరాటం చేస్తున్న తెలుగు రాష్ట్రాలకు రూ. 50 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్టు జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ ట్వీట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఈ డబ్బులను డొనేట్ చేస్తున్నానని, కరోనా మహమ్మారి వ్యాపించకుండా ఈ డబ్బులను వెచ్చించాలని పవన్ కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Coronavirus  donation  ovid-19  Andhra Pradesh  Telangana  Cm relief fund  PM relief fund  India  Politics  

Other Articles