Coronavirus is now a pandemic: WHO కోవిడ్-19ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన డబ్యూహెచ్ఓ

World health organization declares the coronavirus outbreak a global pandemic

World Health Organization, WHO, COVID-19, CoronaVirus, global pandemic, coronavirus rapid spread, 110 countries, 121,000 people infected world wide, Asia, Middle East, Europe, United States, 110 countries, china, russia, iran, kuwait, pandamic, schools, Quarantile, World economy, Asia Economy, Biotechnology

The World Health Organization declared a global pandemic as the coronavirus rapidly spreads across the world. “We’re deeply concerned both by the alarming levels of spread and severity and by the alarming levels of inaction,” the WHO’s chief said.

కోవిడ్-19ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన డబ్యూహెచ్ఓ

Posted: 03/12/2020 12:06 PM IST
World health organization declares the coronavirus outbreak a global pandemic

ప్రపంచంలోని అన్ని ఖండాలకు విస్తరించి ఏకంగా 110 దేశాలకు విస్తరించిన కోవిడ్-19 (కరోనా వైరస్).. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలను కబళించింది. ప్రపంచవ్యాప్తంగా లక్షమందికిపైగా ప్రజలను దాని ప్రభావం భారిన పడేట్లు చేసిన కరోనావైరస్ ను ప్రపంచ మహమ్మారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. చైనాలో వూహాన్ సిటీలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్.. ఇప్పుడు చైనాపై పట్టు తప్పడం సంతోషకరం. అయితే చైనాను వదిలిన కోవిడ్ -19 ప్రస్తుతం ఇటలీ, ఇరాన్, కువైట్, ఇజ్రాయిల్ సహా అమెరికా, ఐరోపా తదితర దేశాల్లోకి చోచ్చుకెళ్లింది.

తొలి మరణాలు సంభవించిన తరువాత కూడా... కరోనాను ప్రపంచ వ్యాధిగా గుర్తించేందుకు నిరాకరించిన డబ్ల్యూహెచ్ఓ, ఇప్పుడు మనసు మార్చుకుంది. "కరోనా వైరస్ ఎంత శరవేగంగా విస్తరిస్తూ, ప్రమాద ఘంటికలను మోగిస్తున్నదో పరిశీలించిన తరువాత, కోవిడ్-19ను మహమ్మారిగా గుర్తిస్తున్నాం" అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టీడ్రాస్ అధానోమ్ మీడియాకు వెల్లడించారు. గత డిసెంబర్ లో చైనాలో తొలిసారిగా కనిపించిన ఈ వైరస్, ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించి, ప్రజల ప్రాణాలను బలిగొనడంతో పాటు ఆర్థిక వృద్ధికీ విఘాతం కలిగించింది.

వేలాది విమాన సర్వీసులు నిలిచిపోగా, ఎన్నో పెద్ద పెద్ద పరిశ్రమలు, తమ ప్లాంట్లను మూసివేయాల్సి వచ్చింది. పాఠశాలలు మూతపడగా, పలు కీలక ఈవెంట్లు వాయిదా పడ్డాయి. అంతర్జాతీయ స్థాయిలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని సైతం ప్రకటిస్తున్నట్టు ఈ సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ఇప్పటివరకూ 4,291 మంది మరణించారని టీడ్రాస్ వ్యాఖ్యానించారు. ఈ వైరస్ మహమ్మారేనని చెప్పడానికి ఇంతకన్నా మరే నిదర్శనాలూ అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. 2009లో హెచ్1ఎన్1 (స్వైన్ ఫ్లూ)ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన తరువాత, డబ్ల్యూహెచ్ఓ మరో వ్యాధిని ఇంత తీవ్రంగా పరిగణించడం ఇదే తొలిసారి.

భారత్ లో మరో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు..

తమ ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్టు ప్రముఖ ఐటీ సంస్థలు డెల్ ఇండియా, మైండ్‌ట్రీ కంపెనీలు ప్రకటించాయి. వీరిని క్వారెంటైన్ చేసి, అత్యుత్తమ వైద్య సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపాయి. డెల్ ఉద్యోగి అమెరికాలోని టెక్సాస్ నుంచి రాగా, మైండ్ ట్రీ ఉద్యోగి కూడా విదేశాలకు వెళ్లి వచ్చారు. దీంతో వీరికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో రిపోర్టులు పాజిటివ్ వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన కంపెనీలు వారికి అత్యుత్తమ వైద్య సాయం అందిస్తున్నాయి. కాగా, యాక్సెంచర్ సంస్థ పూణె కార్యాయలంలోని ఒక అంతస్తును తాత్కాలికంగా మూసివేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : corona virus  world health organisation  110 countries  china  russia  iran  kuwait  pandamic  schools  Quarantile  

Other Articles