5 days Bank holidays in March 2020 అలెర్ట్.. బ్యాంకులకు ఐదు రోజులు వరుస సెలవులు..

Banks to remain closed for five days in march due to strike

bank holidays in march 2020, bank holiday, are bank closed on holi, list of bank holidays in march, 2020, bank strike,RBI,State Bank of India,SBI,Banking and Finance, Banking and Finance, India News, Holidays, Holi, Regional festivals, Business News

Banks will remain closed for continous five days from 10th to 16th March 2020. As the major festival in March 2020 is Holi on 10th March, from 11th march to 13 march bank Unions will be in strike most of them will be closed in protest. 14th second saturday and 15 sunday are general Holiday.

అలెర్ట్.. బ్యాంకులకు ఐదు రోజులు వరుస సెలవులు..

Posted: 03/09/2020 02:51 PM IST
Banks to remain closed for five days in march due to strike

దేశ‌వ్యాప్తంగా బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. రేప మంగళవారం మొదలు మళ్లీ సోమవారమే బ్యాంకులు తెరుచుకోనున్నాయి. వరస సెలవుల నేపథ్యంలో బ్యాంకుల్ల పనులు వున్నవారు ఇక వారి వ్యవహారాలను వచ్చేవారానికే వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. కాగా, ఆరు రోజుల పాటు వరుస సెలవులు మాత్రం దేశవ్యాప్తంగా బ్యాంకులన్నింటికీ వర్తించనుంది. అయితే పలు రాష్ట్రాల్లో మాత్రం ఐదు రోజుల వరస సెలవులు అందుబాటులోకి రానున్నాయి.  

ఈ నెల 10వ తేదీన హోలి పండగా, ఆ తరువాత వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మూడు రోజుల తరువాత రెండో శనివారం, ఆదివారం దీంతో మొత్తంగా ఆరు రోజులు బ్యాంకుల్లో కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. లావాదేవీల కోసం తరచూ బ్యాంకులకు వెళ్లేవారికి ఈ వారంలో కష్టాలు తప్పవు. మార్చి 10న హోలి పండగ.. పలు ప్రాంతాల్లో 9నే హోలిని సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో మార్చి 10 నుంచి ప్రారంభమయ్యే సెలవులు.. మార్చి 11 నుంచి 13- బ్యాంకుల సమ్మె, మార్చి 14- రెండో శనివారం, మార్చి 15- ఆదివారం, దీంతో మళ్లి బ్యాంకులకు తాళాలు తెరుచుకునేది మార్చి 16నే.

ఆ తరువాత మార్చి 25న కూడా తెలుగురాష్ట్రాల బ్యాంకులకు ఉగాది సెలవు వర్తించనుంది. మార్చి 28- నాలుగో శనివారం, మార్చి 29- ఆదివారం.. ఇలా చివరి వారంలోనూ మూడు రోజుల పాటు బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగిసే నెలలో బ్యాంకులకు సెలవులు, కార్మిక సంఘాల సమ్మెలతో ఖాతాదారులకు కొంత ఇబ్బందికర పరిణామాలే ఎదురుకానున్నాయి. మీకు బ్యాంకుల్లో పనులేమైనా వుంటే.. వాటని వర్కింగ్ డేస్ లోనే త్వరగా పూర్తి చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి లేదా.. అపరాద రుసములు వెంటపడేను జాగ్రత్తా. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bank strike  RBI  State Bank of India  SBI  Holidays  Holi  Regional festival  Banking Unions Stike  Business News  

Other Articles