TDP Not To Contest In Ananthapur District? ఎన్నికల్లో పోటీ చేయలేం: జేసీ దివాకర్ రెడ్డి

Jc diwarkar reddy sensational comments on ys jagan and chandrababu

JC sensational comments on AP Government, JC sensational comments on YSRCP Government, JC Diwakar Reddy sensational comments on Jagan Government, JC Diwakar Reddy, YS Jagan, YSRCP, TDP, Ananthapur, YS Jagan Government, Andhra Pradesh, Politics

TDP Senior Leader, former MP JC Diwarkar Reddy made sensational comments that the TDP will not contest the local body elections in Ananthapur district. He indicated that the contesting elections would lead to police cases which he is not ready to face at this point of time.

ITEMVIDEOS: ఎన్నికల్లో పోటీ చేయలేం: జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Posted: 03/05/2020 02:44 PM IST
Jc diwarkar reddy sensational comments on ys jagan and chandrababu

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనదైన స్టైల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలను ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా పరోక్షంగా మాత్ర అదే ఉద్దేశ్యం వచ్చేట్టు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎలాంటి ఎన్నికలలోనూ తమ పార్టీ పోటీపడబోదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో జరిగనున్న పురపాలక, మండల పరిషత్, జిల్లా పరిషత్, స్థానిక సంస్థలు, గ్రామ పంచాయితీ ఎన్నికలలో కూడా తమ పార్టీ పోటీ చేయబోదని ఆయన స్పష్టం చేశారు.

తన అనుభవాన్నంతా రంగరించి.. కర్ర విరగొద్దు.. పాము చావద్దు అన్న చందంగా రాజకీయ వ్యాఖ్యలు చేయడంలో నిష్ణాతుడైన ఆయన ప్రస్తుతం కొంత వైరాగ్య ధోరణిలో వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి మునిసిపాలిటీతోపాటు నియోజకవర్గంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి ఎవరూ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఒక వేళ పోటీ చేసినా అనర్హత వేటు వేస్తారని, లేదంటే కొత్త చట్టాల పేరుతో జైలులో వేస్తారని, దానికంటే పోటీ చేయకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు.

వివిధ కేసుల్లో చిక్కుకుని రెండు నెలలపాటు జైలు శిక్ష అనుభవించిన జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు చింబిలి వెంకటరమణ విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయనను పరామర్శించేందుకు అక్కన్నపల్లికి వెళ్లిన జేసీ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని జేసీ తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో ఎదుర్కొన్న చేధు అనుభవాలపై కూడా వ్యాఖ్యలు చేశారు. విశాఖ పర్యటనకు వెళ్లిన చంద్రబాబును వైసీపీ మద్దతుదారులు చావగొట్టకుండా వదిలిపెట్టడం ఆయన అదృష్టమని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JC Diwakar Reddy  YS Jagan  YSRCP  TDP  Ananthapur  YS Jagan Government  Andhra Pradesh  Politics  

Other Articles