CAA violence: Delhi High Court Judge transferred సీఏఏ అల్లర్లు: పోలీసులపై మండిపడ్డ న్యాయమూర్తి బదిలీ.!

Centre notifies transfer of justice s muralidhar from delhi high court

Supreme Court collegium, Sharad A Bobde, Justice Muralidhar, Delhi High Court to Punjab, Haryana High Court, Rashtrapati Bhavan, Ramnath Kovind, Delhi violence, clash in delhi, northeast delhi riots, Citizenship amendment act, Delhi, Narendra Modi, Amit Shah, National Politics, Crime

President Ram Nath Kovind signed off on the transfer of Justice S Muralidhar from Delhi High Court to Punjab and Haryana High Court. The notification said Justice Muralidhar was directed to assume charge as a judge of Punjab and Haryana High Court.

సీఏఏ అల్లర్లు: పోలీసులపై మండిపడ్డ న్యాయమూర్తి బదిలీ.!

Posted: 02/27/2020 10:45 AM IST
Centre notifies transfer of justice s muralidhar from delhi high court

ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో దాఖలపై పిటీషన్లపై అర్థరాత్రి విచారించి.. పరిణామాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, పోలీసులను తీరును ఎండగడుతూ వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిపై 24 గంటలు కూడా తిరక్కుండానే బదిలీ వేటు పడింది. ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లు, హింసాత్మక ఘటనలపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనల్లో ఏకంగా 28 మంది ప్రాణాలు కొల్పోగా. 200 మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో పలువురు పరిస్థితి విషమంగా వుంది.

ఢిల్లీ అల్లర్ల నేపధ్యంలో పోలీసుల తీరును తప్పుబడుతూ నమోదైన పిటిషన్లను అర్ధరాత్రి విచారించి.. ముందుగా క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలను అందించాలని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మురళీధర్‌ అదేశించిన విషయం తెలిసిందే. పోలీసులు ముందస్తుచర్యలు తీసుకుని వుంటే ఇలాంటి పరిణమాలు ఉత్పన్నమయ్యేవి కాదంటూ వారి తీరును విమర్శించారు. దీంతో 24 గంటలు కూడా తిరక్కుండానే ఆయనను ఢిల్లీ హైకోర్టు నుంచి పంజాబ-హర్యానా హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.

భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే సహా ముగ్గురు సభ్యులు గల సుప్రీంకోర్టు కోలిజియం ఫిబ్రవరి 12నే జస్టిస్ మురళీధర్ ను బదిలీ చేసింది. కాగా తాజాగా ఈ మేరకు ఉత్తర్వులపై రాష్ట్రపతి అమోదం లభించడంతో ఆయన బదిలీ ఖరారయ్యింది. కాగా, జస్టిస్ మురళీధర్ బదిలీపై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ విస్మయాన్ని వ్యక్తం చేసింది. నిష్పక్షపాతంగా జరగాల్సిన బదిలీని ఇలా అకస్మికంగా చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. అంతేకాదు జస్టిస్ మురళీధర్ బదిలీకి నిరసనగా ఒక్కరోజు తాము విధులకు హాజరుకామని కూడా న్యాయస్థాన న్యాయవాదులు నిర్ణయించారు.

కాగా న్యాయమూర్తుల బదిలీ సర్వసాధారణమే అయినా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కాకుండా సీనియర్ న్యాయమూర్తులను ఇతర న్యాయస్థానాలకు బదిలీ చేయడం శిక్ష కిందే పరిగణిస్తారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డిఎన్ పటేల్, జస్టిస్ జీఎస్ సిస్థానీ తరువాత మూడవ సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ మురళీధర్ కొనసాగుతున్నారు. జస్టిస్ మురళీధర్ నేతృత్వంలోని బెంచ్ ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో ఢిల్లీ పోలీసుల తీరును ఎండగట్టింది. బీజేపి రాజకీయ నేతలపై ఎలాంటి ఎఫ్ఐఆర్ లు నమోదు చేయకపోవడం, వారి విద్వేషపూరిత ప్రసంగాలను అడ్డుకోకపోవడం.. వాటిని రికార్డు చేయకపోవడంపై మండిపడ్డి విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles