Nalgonda Court delivers death sentence to Hajipur serial killer నల్గోండ కోర్టు సంచలన తీర్పు.. హాజీపూర్ కిల్లర్ కు ‘ఉరి’..

Nalgonda court sentences capital punishment to hajipur serial killer srinivas reddy

verdict reserved in Hazipur case, verdict reserved in Hajipur case, hajipur case accused srinivas reddy, hajipur accused srinivas reddy, hazipur, hazipur case, hajipur, hazipur incident, hajipur well, hajipur news, hajipur public, hajipur serial killer, Srinivas Reddy, Crime

The POSCO court in Nalgonda delivers capital punishment to Hajipur serial killings on Thursday. Delivering its final verdict on three cases filed against the accused Marri Srinivas Reddy in the rape and murder of three girls, the POSCO Court has given death sentence.

ITEMVIDEOS: హాజీపూర్ సీరియల్ కిల్లర్ కు ఉరి ‘శిక్ష’.. నల్గోండ కోర్టు సంచలన తీర్పు..

Posted: 02/06/2020 04:17 PM IST
Nalgonda court sentences capital punishment to hajipur serial killer srinivas reddy

తెలుగురాష్ట్రాలలో సంచలనం రేపిన హాజీపూర్ వరుస హత్యల కేసులో దోషిగా నిర్థారించిన న్యాయస్థానం సీరియల్ కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెల్లడించింది. హైదరాబాద్ నగర శివారల్లో నివాసం ఉంటూ.. తన స్వగ్రామమైన భువనగిరి జిల్లా బొమ్మలరామారంకు బైక్ పై వచ్చిన శ్రీనివాస్ రెడ్డి మూడు పర్యాయాలు ముగ్గురు మైనర్ బాలికలను చిదిమేసి.. గట్టుగా వుండేందుకు తనకు చెందిన వ్యవసాయ బావిలోనే పూడ్చిపెట్టాడు. ఈ కేసులో దోషిగా తేలిన శ్రీనివాస్ రెడ్డిపై ఆరు నెలల పాటు రెగ్యూలర్ గా విచారించిన న్యాయస్థానం.. ఇవాళ తుది తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని న్యాయస్థానం దోషిగా తేల్చింది.

ఈ కేసు విచారణ కోసం గత ఏడాది జులై 31న ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానం నల్గోండలో ఏర్పాటైంది. కాగా అంతకుముందే కర్నూలు జిల్లాలో శ్రీనివాస్ రెడ్డిపై మరో హత్యకేసు నమోదైంది. బాధితులంతా మైనర్ బాలికలు కావడంతో అతనిపై ఫోక్సో చట్టం కింద కేసులు పోలీసులు కేసు నమోదు చేశారు. జూలై 31న ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు కాగా, దాదాపు మూడు నెలల నుంచి 101 మంది విచారించింది. వీరిలో బాధితుల తల్లిదండ్రుల, బంధువులు, ప్రత్యక్ష సాక్ష్యులు, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు, పంచనామా చేసినవారితో పాటు పలువురు వున్నారు.

జనవరి నెల 27న ఈ కేసులో తుది తీర్పు వెలువరించనున్నట్లు పోక్సో కోర్టు న్యాయమూర్తి జనవరి 17న ప్రాసిక్యూషన్.. ఢిఫెన్స్ ల మధ్య వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేసినట్లు న్యాయమూర్తి వెల్లడించారు. అయితే అప్పటికీ డిఫెన్స్ కౌన్సిల్ రెండు కేసుల్లో వాదనలు వినపించలేదు. అయినా ఈకేసులో జనవరి 27న తీర్పును వెలువరించనున్నట్లు తెలిపింది. అయితే తీర్పును వెలువరించిడంతో మరో రెండు వారాల సమయం తీసుకున్న న్యాయస్థానం ఫిబ్రవరి 6న.. శ్రీనివాస్ రెడ్డిని దోషిగా నిర్థారించిన న్యాయస్థానం తుదితీర్పును వెలువరించింది.

కాగా, బోజన విరామానికి ముందు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని న్యాయమూర్తి పలు ప్రశ్నలు అడిగారు. ముగ్గురు మైనర్లపై హత్యాచార కేసులో నేరం నిరూపితమైందని, మూడు కేసుల్లో నేరస్తుడిగా ప్రాసిక్యూషన్ నిరూపించిందని.. శిక్ష గురించి ఎమైనా చెప్పుకుంటావా అని జడ్జీ అడిగారు. తనకు కేసులతో ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పాడు. పోలీసులు హింసించారని, తన తల్లిదండ్రులు వృద్ధులని, వారికి ఎవరూ లేరని రోదిస్తూ చెప్పాడు. వారు ఎక్కడున్నారో చెప్పాలని కోర్టు కోరిగా.. తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియదని దోషి తెలిపాడు. తనపై కోపంతో ఊర్లో ఉన్న ఇల్లు తగలబెట్టారని.. భూములు లాక్కున్నారని తెలిపాడు.  

కేసు పూర్వాపరాలు:

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ లో ముగ్గురు మైనర్ బాలికల హత్యలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. శ్రావణి, కల్పన, మనీషాను అత్యాచారం చేసి చంపేశాడు. మూడేళ్లలో ముగ్గురు బాలికలను కిరాతకంగా హత్య చేశాడు. మరో మహిళ హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. గ్రామానికి రవాణ సౌకర్యం లేకపోవడంతో ఊళ్లోకి వెళ్లే వాహనాలను లిప్ట్ అడిగి గ్రామానికి విద్యార్థులు చేరుకుంటారు. దీంతో శ్రీనివాస్ రెడ్డిని లిప్ట్ అడిగి ఆతడి వాహనం ఎక్కిన విద్యార్థులను తన పోలంలోని వ్యవసాయ బావికి తీసుకెళ్లి అక్కడ వారిపై అత్యాచారం చేసి దారుణంగా హతమర్చాడు.

ఆ తరువాత వారిని అక్కడే పూడ్చిపెట్టాడు. గత ఏడాది ఏప్రిల్ 25న శ్రావణి తప్పిపోయిందన్న పిర్యాదుతో నమోదైన కేసులో భాగాంగా పోలీసుల దర్యాప్తు ప్రారంభించిం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ బావిలో శ్రావణి మృతదేహాన్ని వెలికితీశారు. ఆ తరువాత అనుమానంతో పోలీసులు మరోసారి తవ్వగా కల్పన, మనీషాల మృతదేహాలు కూడా బయటపడ్డాయి. దీంతో పోలీసులు ఈ సీరియల్ కిల్లర్ పై ఫోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles