Centre shares good news with nizamabad farmers నిజామాబాద్ రైతన్నకు కేంద్రం గుడ్ న్యూస్..

Centre gives green signal for regional spices board in nizamabad

Union Minister Piyush Goyal, Nizamabad farmers, Regional Spices Board, Turmeric powder, Kalvakuntal kavitha, Dharmapuri Aravind, TRS, BJP, IAS officer, Nizamabad, Telangana, Politics

Union Minister Piyush Goyal has made a crucial statement on the expansion of the Spice Board. He said that a new Regional Spices Board would be set up in Nizamabad. He said the board would focus on turmeric crops exports along with other pulses.

నిజామాబాద్ రైతన్నకు కేంద్రం గుడ్ న్యూస్.. ప్రాంతీయ బోర్డుకు పచ్చజెండా

Posted: 02/04/2020 07:13 PM IST
Centre gives green signal for regional spices board in nizamabad

తెలంగాణ పసుపు రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. నిజామాబాద్‌ జిల్లాలో సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డు (స్పైసెస్ రీజినల్ ఎక్స్‌టెన్షన్ సెంటర్) కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఇవాళ పార్లమెంటులో ఈ మేరకు ప్రకటన చేశారు. దీనిపై త్వరలోనే అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం అక్కడున్న డివిజినల్‌ స్థాయి కార్యాలయాన్ని ప్రాంతీయ స్థాయికి పెంచనున్నట్లు పీయూష్ గోయల్ వెల్లడించారు.

పసుపు, మిరప పంటను దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ లో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు పీయూష్ గోయల్‌ వెల్లడించారు. ఐఏఎస్‌ హోదా డైరెక్టర్‌ స్థాయి అధికారి ఈ ప్రాంతీయ కార్యాలయంలో కార్యకలాపాలను పర్యవేక్షించనున్నట్లు గోయల్ తెలిపారు. ఈ ప్రాంతీయ కార్యాలయం నేరుగా కేంద్ర మంత్రిత్వ శాఖకు నివేదిస్తుందని వెల్లడించారు. సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డు ఏర్పాటుతో పసుపుతో పాటు మిరప ఇతర పంటలకు కూడా ప్రయోజనం కలుగుతుందని కేంద్రమంత్రి తెలిపారు.

పసుపు బోర్డు ఏర్పాటు అంటే కేవలం పసుపుకు మాత్రమే కాకుండా అంతకుమించి రైతులకు ప్రయోజనం జరుగుతుందన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చొరవతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సెంటర్ తో నిజామాబాద్ తో పాటు ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పసుపు, మిరప రైతులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ఈ బోర్డు ఏర్పాటు నిమిత్తం అధికారిక ప్రకటన చేసిన ఆయన త్వరలోనే ఈ మేరకు నోటిఫికేషన్ సహా అన్నింటినీ కేంద్రం విడుదల చేస్తోందని అన్నారు.

పసుపు బోర్డు, మద్దతు ధర కోసం నిజామాబాద్ రైతులు చాలా కాలంగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 175 మంది పసుపు రైతులు నామినేషన్లు వేసి సవాలు విసిరారు. దీంతో ఈ అంశం దేశం దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం కేరళలో స్పైసెస్ బోర్డు కార్యాలయం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని పసుపు రైతుల కోసం దీనికి అదనంగా రీజినల్ ఎక్స్ టెన్షన్ కేంద్రాన్ని నిజామాబాద్ లో ఏర్పాటు చేయనున్నారు. పసుపు పంట నాణ్యత, మద్దతు ధర తదితర విషయాలను రీజినల్ బోర్డు పర్యవేక్షించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles