Adialabad Court sentences capital punishment in Samatha Case అదిలాబాద్ కోర్టు సంచలన తీర్పు.. సమత దోషులకు మరణశిక్ష

Adialabad court sensational judgemet death sentence in samatha case

Adialabad Special Court, Samatha case, Accused, Shaik Babu, Shaik Shaboddin, Shaik Makdum, Adilabad, telangana, Crime

Adialabad Special Court pronounces Sensational Judgment in Samatha Case. The Court sentences death penalty to all the Three accused in samatha rape and murder case

అదిలాబాద్ కోర్టు సంచలన తీర్పు.. సమత దోషులకు మరణశిక్ష

Posted: 01/30/2020 01:45 PM IST
Adialabad court sensational judgemet death sentence in samatha case

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన సమత హత్యాచారం కేసులో అదిలాబాద్ ప్రత్యేక ఫాస్ట్రాక్ న్యాయస్థానం ఇవాళ సంచలన తీర్పును వెలువరిచింది. సమత అత్యాచారం హత్య కేసులోని ముగ్గురు దోషులకు కోర్టు మరణ శిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. ఆదిలాబాద్ ఫాస్ట్రాక్ కోర్టు న్యాయమూర్తి గురువారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో అభియోగాలను ఎదుర్కోన్న నిందితులు షేక్‌ బాబు, షేక్‌ షాబుద్దీన్, షేక్‌ మగ్దూమ్ లను దోషులుగా నిర్థారించిన న్యాయస్థానం తాజాగా తీర్పును వెలువరించింది.దోషులు చేసిన నేరం ఘోరమైందిగా తీర్పు సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

సమత అత్యాచారం హత్య కేసు తీర్పును వెలువరించే సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘‘మీపై నేరం రుజువైందని, కోర్టుకు ఏమైనా చెప్పుకొనేది ఉందా’’ అని నిందితులకు అడిగారు. దీనిపై స్పందించిన ప్రధాన నిందితుడు షేక్ బాబు.. తనకు ప్రాణభిక్ష పెట్టాలని, కంటతడి పెడుతూ న్యాయమూర్తిని వేడుకున్నాడు. మిగతా నిందితులు కూడా ఇదే కోరారు. తమకు చిన్న పిల్లలున్నారని, కుటుంబానికి పెద్ద దిక్కు తామేనని వాపోయారు. కాబట్టి తమను వదిలేయాలని నిందితులు న్యాయమూర్తిని వేడుకున్నారు.

నిజానికి ఈ కేసులో తీర్పు ఈ నెల 27న వెల్లడి కావాల్సి ఉన్నా, న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా సెలవులో ఉన్నారు. ఈ నేపథ్యంలో తీర్పును నేటికి వాయిదా వేశారు. కుమరం భీం జిల్లా లింగాపూర్‌ అటవీ ప్రాంతంలోని ఎల్లపటార్‌లో నవంబర్‌ 24న.. షేక్‌ బాబు, షేక్‌ షాబుద్దీన్, షేక్‌ మగ్దూమ్‌లు సమతను అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ కేసు విచారణకు డిసెంబర్ 11న ఆదిలాబాద్లో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. ఈ కేసులో బాధితురాలి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు, పోలీసు, రెవెన్యూ అధికారులు, ఫోరెన్సిక్ వైద్యులు మొత్తం 25 మంది సాక్షులను కోర్టు విచారణ జరిపింది. డిసెంబర్ 31న కోర్టు విచారణ పూర్తి చేసింది. ఈ నెల 20తో ప్రాసిక్యూషన్, డిఫెన్స్ లాయర్ల మధ్య వాదనలు ముగిశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles