JanaSena-BJP Long March postponed బీజేపి-జనసేన ‘లాంగ్ మార్చ్’ వాయిదా..

Pawan kalyan to have legal battle on propaganda postpones long march

Janasena, BJP, Pawan kalyan, Vijayawada, Long March, Assembly padayatra, Amaravati, Visakhapatnam, wrong propaganda, defamation suit, social media, false articles, farmers, Capital city, Amaravati, agitation, Nadella Manohar, Sunil Deodhara. GVL Narasimha Rao, Amaravati, Visakhapatnam, AP CM Jagan, YSRCP party, Andhra Pradesh, Politics

After Pawan Kalyan’s Jana Sena Party entered into an alliance with the BJP in Andhra Pradesh, both the parties gave a call of Long March against the proposal for shifting the capital from Amaravati, which had been postponed.

దుష్ప్రచారంపై పవన్ న్యాయసమరం.. బీజేపి-జనసేన ‘లాంగ్ మార్చ్’ వాయిదా..

Posted: 01/25/2020 04:41 PM IST
Pawan kalyan to have legal battle on propaganda postpones long march

రాష్ట్ర భవిష్యత్ కోసం తమ భూములను త్యాజించిన రైతులకు అండగా నిలబడిన వారిపై అధికార పార్టీకి చెందినవారు అసత్య ప్రచారం చేసి తమ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్న నేపథ్యంలో అలాంటివారిపై న్యాయసమయం చేసేందుకు సిద్దమయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అమరావతి రైతులకు అండగా నిలుస్తానని చెప్పడం.. వారితో కలసి పోరాటాలు చేయడంతో జీర్ణించుకోలేని పలు శక్తులు ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నాయని దీంతో వారిపై న్యాయపరమైన సమరశంఖాన్ని పూరించనున్నామని జనసేన వార్గాలు తెలిపాయి.

రైతుగా రైతుల కష్టాలు తెలిసి.. మూడు పంటలు పండించే రైతన్న తన వ్యవసాయం కన్నా రాష్ట్రానికి రాజధాని ముఖ్యమని భూములను అప్పగిస్తే.. వారికి అండగా నిలచి.. వారి తరపున పోరాడుతానని పిలుపు ఇవ్వడంతో పవన్ కల్యాణ్ పైనే పలు శక్తులు సామాజిక మాద్యమాల వేదికగా దుష్ప్రచారం చేస్తున్నాయని జనసేన వర్గాలు తెలిపాయి. అమరావతి ప్రాంతంలో పవన్ కల్యాణ్ కు 62 ఎకరాల మేర భూములు ఉన్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాయి.

రైతుల కోసం స్వచ్ఛందంగా వచ్చి పోరాడుతున్న పవన్ పై ఈ తరహా అసత్య కథనాలు వస్తున్నాయిని తెలిపాయి. పవన్ పేరిట తప్పుడు పత్రాలు సృష్టించి.. కల్పిత వార్తలు పత్రికలలోనూ ప్రచురితం అయ్యాయంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని, అలాంటివారిపై పరువునష్టం దావా వేస్తున్నామని జనసేన పార్టీ న్యాయవిభాగం వెల్లడించింది. న్విస్వార్థ రాజకీయ నాయకుడు, ప్రజా సంక్షేమ, ప్రజాబీష్టంతోనే ముందుకెళ్లే నేతపై అవినీతి మకిలి అంటించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డింది.

ఈ ప్రచారానికి కారకులైన వారికి లీగల్ నోటీసులు పంపుతామని జనసేన పార్టీ లీగల్ సెల్ కోఆర్డినేటర్ సాంబశివ ప్రతాప్ ఓ ప్రకటనలో తెలిపారు. జనసేనను రాజకీయంగా ఎదుర్కోలేక, జనసేన సాగిస్తున్న ప్రజా పోరాటానికి కోట్లాది గొంతులు తోడుండడంతో ఎదురునిలిచి పోరాడలేని అల్పులే ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అమరావతి రైతులు గోడును అది నుంచి ఆలకిస్తూ.. వారికి అండగా నిలిచి పోరాటం చేస్తున్న శక్తిని ఎదుర్కోనలేకే ఈ దుష్ప్రచారాలు సాగుతున్నాయని అరోపించారు

లాంగ్ మార్చ్ వాయిదా.. త్వరలోనే తేదీ వెల్లడి:

ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాజధాని అమరావతి కోసం సంయుక్త పోరాటాలు చేయాలని రెండు పార్టీల నాయకత్వాలు నిశ్చయించాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 2న విజయవాడలో లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని జనసేనాని పవన్ కల్యాణ్ దేశ రాజధానిలో ప్రకటించారు. అయితే ఇప్పుడా లాంగ్ మార్చ్ కార్యక్రమం వాయిదా పడింది. త్వరలోనే తాజా కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగభూషణం తెలిపారు. లాంగ్ మార్చ్ ఎప్పుడు నిర్వహించేది తదుపరి నిర్ణయిస్తామని అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  JanaSena  BJP  Long March  Amaravati  wrong propaganda  AP CM Jagan  Andhra Pradesh  Politics  

Other Articles