Toddler in rural NSW sees rain for the first time నెట్టింట్లో అస్ట్రేలియా బుడతడి వీడియో వైరల్

Little boy dances in the rain for the very first time as downpour soaks fire ravaged nsw

heartwarming video, Sunni Mckenzie, Toddler, Tiffanie Mckenzie, mother, New South Wales, Australia, social media, viral video, video viral

A little boy who has never seen rain in his life has spent the morning dancing under the downpour that hit his family's farm in NSW. The 18-month-old's mum shared a video of him running around their property in Scone, exclaiming "wow" as he tried to figure out what was going on.

ITEMVIDEOS: ‘‘వర్షం ఎక్కడి నుంచి పడుతోంది.?’’ నెట్టింట్లో అస్ట్రేలియా బుడతడి వీడియో వైరల్

Posted: 01/16/2020 03:57 PM IST
Little boy dances in the rain for the very first time as downpour soaks fire ravaged nsw

నీళ్లు పడుతున్నాయేంటీ.? ఎవరూ పోయకుండానే అంతటా నీళ్లు ఒక్కేసారి ఎలా పడుతున్నాయ్.. అంటూ ఆశ్చర్యపోతున్న ఈ బుడతగి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. అప్పుడు  బుడతడి తల్లి అతడికి వివరించింది ఇది వర్షం.. ఇది ఆకాశం నుంచి కురుస్తోందని.. వస్తున్నాయి?' అంటూ మొట్టమొదటి సారిగా వర్షాన్ని చూసిన ఓ చిన్నారి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, వర్షంలో తడుస్తూ సంబరపడి పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. చిన్నారి వీడియోను ప్రపంచవ్యాప్తంగా అనేక మంది షేర్ చేస్తూ లైక్ చేస్తున్నారు.

ఇందులో అంత ఆశ్చర్యమేముందీ.? అని అనుకుంటారు అంతా.. ఆస్ట్రేలియాలోని అనేక ప్రాంతాల్లో పర్యావరణం భారీగా నాశనం చేసిన కార్చిచ్చు.. అడవులను దహించివేసి లక్షలాది మూగజీవాలను, వన్యప్రాణులను సైతం కబళించివేశాయి. గతేడాది సెప్టెంబరులో మొదలైన కార్చిచ్చు అడవులను దహించి వేస్తోంది. ఇటీవల అగ్నికీలలకు తగులబడిపోయిన కొన్ని ప్రాంతాల్లో తాజాగా వర్షం పడడంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కార్చిచ్చు రగల్చిన పర్యావరణ భీతావహ పరిస్థితిని వరుణుడు చల్లార్చాడని అందరూ సంబరపడిపోతున్నారు.

ఇదే క్రమంలో వర్షాన్ని తొలిసారిగా అస్వాదించిన 18 నెలల సన్నీ మకెజీన్ అనే చిన్నారి వర్షంలోకి పరుగులు తీసి, అటూ ఇటూ తిరుగుతూ సంబరంలో మునిగితేలిపోయాడు. అతడు మొట్టమొదటిసారి వర్షాన్ని చూశాడు. న్యూ సౌత్ వేల్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ తోటలో ఆ చిన్నారి వర్షంలో తడుస్తూ డ్యాన్స్ వేస్తుండగా తీసిన వీడియోను అతడి తల్లి టిఫ్ఫానీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద షేర్ చేశారు.

కార్చిచ్చుతో తగలబడి పోతోన్న ఆస్ట్రేలియాలో భారీ వర్షాలు ఆనందం నింపుతున్నాయని, 18 నెలల ఓ బాలుడు మొట్టమొదటిసారి వర్షాన్ని చూసి, ఆశ్చర్యపోయాడని  సుశాంత నంద తెలిపారు. ఆ పిల్లాడి సంబరానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆస్ట్రేలియాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుండడంతో వాతావరణం తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఆస్ట్రేలియా అడవుల్లో కార్చిచ్చు కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వందల సంఖ్యలో ఇళ్లు నాశనమయ్యాయి.. వాతావరణంలో కాలుష్య స్థాయి విపరీతంగా పెరిగిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles