Man dies while doing stunts in moving train యువకుడి ప్రాణం తీసిన స్టంట్.. కదులుతున్న రైలులో..

Man dies while doing stunts in moving train video goes viral

Mumbai train Stunt, youth dies in stunt, Diva, Mumbra, Dilshat Khan, Kalyan station, video clip, Indian Railways, mobile Phone, Tik Tok, Mumbai, Accident

Even after many warnings and alerts from Indian Railways, some youngsters didn't change their attitude and indulging in dangerous stunts in moving trains which costs their lives. A similar tragic incident took place in a Mumbai local train on 26 December.

ITEMVIDEOS: యువకుడి ప్రాణం తీసిన స్టంట్.. కదులుతున్న రైలులో..

Posted: 12/30/2019 03:39 PM IST
Man dies while doing stunts in moving train video goes viral

ప్రాణంతీపి తెలియని రోజులు.. అయినవారు ఎవరూ గుర్తు రాని వయస్సు.. తమ చుట్టూవున్నవారిలో ప్రత్యేకమని ప్రదర్శించేందుకు.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేసే స్టంట్లు ప్రాణాలను సైతం హరిస్తాయని ఇప్పటికే పలు ఘటనల్లో నిరూపితమైంది. ముఖ్యంగా రైళ్లో ప్రయాణం చేసే యువత కుదరుగా వుండకుండా స్టేషన్ వచ్చిన ప్రతీ సారీ ట్రైన్ దిగుతూ, ఎక్కుతూ కాసింత రిలీప్ పోందుతుంటారు. అది చాలదన్నట్టు కదిలే రైలు నుంచి బయటికి వేళాడుతూ వెక్కిలి చేష్టలు చేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే ముంబై లోకల్ రైలులోనూ చోటుచేసుకుంది.

ప్రమాదమని తెలిసి కూడా కదులుతున్న రైలు డోర్‌ వద్ద నిలబడి బయటకు వేలాడుతూ ఫీట్‌ చేశాడు. కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత ఫిల్లర్ రూపంలో వచ్చిన యమపాశాన్ని తప్పుంచుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. పిల్లర్ కు యువకుడి తల గట్టిగా తగిలి రైలు నుంచి కిందపడిపోయి ప్రాణాలనే వదిలేసాడు. స్నేహితుల మొప్పు కోసం చేసిన ఈ ఫీట్ తో అతని తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను భారతీయ రైల్వే అధికారులు విడుదల చేశారు.

వివరాల్లోకెళితే మహారాష్ట్రలోని కల్యాన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. దిల్షాన్ ‌(20) అనే యువకుడు తన సోదరుడి వివాహానికి కొత్త బట్టలు కొనేందుకు స్నేహితులతో కలిసి రైల్లో గోవాండీకి బయల్దేరాడు. ఇదే సమయంలో అతని స్నేహితులను వీడియో తీయమని చెప్పి తాను ఎక్కిన బోగి ద్వారం వద్ద స్టంట్లు చేస్తున్నారు. అదే సమయంలో ఓ ఫిల్లర్ కు అతని తల తగిలింది. దీంతో దిల్షాన్‌ అక్కడే కిందపడి మృతి చెందాడు. వెంటనే రైలును నిలపి బాధితు యువకుడిని అసుపత్రికి తీసుకెళ్లినా.. అతను అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు.

దీంతో కొద్ది రోజుల్లో శుభకార్యం జరగాల్సిన ఇంట విషాద చాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక అతను చేస్తు్న్న స్టంట్లను వీడియో తీసిన స్నేహితులు ఈ వీడియోను రైల్వే శా‌ఖకు అందించారు. దీంతో స్వయంగా రైల్వే మంత్రిత్వ శాఖ వీడియోని ట్వీట్‌ చేసింది. రైలులో ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేయవద్దు, ఇది చట్టవిరుద్ధమని తెలిపింది. ఇలాంటి స్టంట్స్ ద్వారా తమ ప్రాణాలు కూడా పోతాయని పోతాయని ప్రయాణికులను వారించింది. ఇప్పటికైనా యువత ఇలాంటి స్టంట్లను మానుకోవాలని హెచ్చరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles