Trainee IPS officer visits ongole police station సామాన్యుడిలా ఠాణాకు ట్రైనీ ఐపీఎస్.. ఎం జరిగిందంటే..

Trainee ips officer visits ongole police station pretending as complainant

Mobile Phone, Jagadesh, Trainee IPS officer, Ongole police station, Prakasam district, SP Siddharth Koushal, Andhra Pradesh, Crime

The police of ongole police station became alert after the sudden visit of trainee ips officer approached stations alleges lost of his mobile phone pretending as a common youth from district. Based on his report on the station officials, Prakasam district SP Siddharth Koushal suspended the station writer.

సైకిల్ పై సామాన్యుడిలా.. ఠాణాకు ట్రైనీ ఐపీఎస్.. ఎం జరిగిందంటే..

Posted: 12/28/2019 11:40 AM IST
Trainee ips officer visits ongole police station pretending as complainant

ఒంగోలులోని తాలుకా పోలీస్ స్టేషన్ కి సైకిల్ సామాన్య యువకుడు వెళ్లి.. తన మొబైల్ ఫోన్ పోయిందని పిర్యాదు చేశాడు. దీంతో స్టేషన్ లోని ఓ కానిస్టేబుల్ తన మొబైల్ ఫోన్ వివరాలతో పాటు తన వివరాలను కూడా తీసుకుని మమ అనిపించేశాడు. అయితే తన మొబైల్ పోయిందని ఎఫ్ఐఆర్ కాఫీ ఇవ్వాలని సదరు యువకుడు పోలీసులను అడిగాడు. పోయింది సెల్ ఫోనేగా.. అంటూ తీసిపాడేశారు అక్కడి పోలీసులు. ఇక మరికొందరు అంత ఖరీదైన సెల్ ఫోన్ వాడుతున్నప్పుడు నువ్వే జాగ్రత్తగా వుండాలి కానీ.. పోయిన తరువాత పోలీసుల వద్దకు వచ్చి ఎప్ఐఆర్ కావాలని పేచి పెడితే ఎలా అంటూ మరికొందరు ఉచిత సలహా ఇచ్చారు.

పోలీసుల వద్దకు ఎవరు వచ్చినా.. వారి పిర్యాదును స్వీకరించి.. ఆ వెంటనే పిర్యాదుదారుడు డిమాండ్ చేస్తే.. ఎఫ్ఐఆర్ కాఫీ కూడా ఇవ్వాలన్నది విధి కదా.? అంటూ యువకుడు ప్రశ్నించారు. మొబైల్ ఫోన్ పోయిందంటేనే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు.. ఇలా క్వాశ్చన్ చేసిన యువకుడిని కళ్లతో కింద నుంచి పైకి స్కాన్ చేయడం ప్రారంభించారు. రైటర్ మాత్రమే కాదు.. స్టేషన్ లోకి ఎంటైర్ అవుతున్న క్రమంలో సెంట్రీ మొదలు.. కానిస్టేబుల్ వరకు అందరూ యువకుడి పట్ల నిర్లక్ష్యంగానే మాట్లాడారు. రోజూ వందల ఫోన్లు పోతూ ఉంటాయని.. అన్నింటికీ కేసులు రాయలేమని చెప్పారు.

ఇక స్టేషన్ రైటర్ అయితే మొబైల్ ఫోన్ పై వివరాలు తీసుకోవడమే ఎక్కువ.. అలాంటిది దానిపై ఎఫ్ఐఆర్ కూడా రాసి పట్టుకోవాలంటే.. స్టేషన్ మూసుకోవాలంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దాదాపు రెండు, మూడు గంటలపాటు.. సదరు యువకుడు అక్కడ వెయిట్ చేశాడు. అంతసేపు ఈ యువకుడు ఎప్పుడు వెళ్లిపోతాడా అని చూసినవాళ్లే కానీ.. కనీసం కూర్చోమని చెప్పిన పోలీసు కరువయ్యాడు. ఇలా మూడు గంటలు గడిచిన తరువాత.. ఇక సదరు యువకుడు తన ఐడెంటినీని చెప్పక తప్పలేదు. దీంతో అక్కడున్న సిబ్బంది అంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

వెంటనే తేరుకుని... గత మూడు గంటలుగా తమతో ఎఫ్ఐఆర్ కావాలని వాదించిన వ్యక్తి సామాన్య యువకుడు కాదని.. ఓ ట్రైనీ ఐపీఎస్ అని తెలుసుకున్న పోలీసులంతా ఒక్క క్షణంలో నిజంగా పోలీసులుగా వ్యవహరించారు. అప్పటివరకు నిర్లక్ష్యంగా మాట్లాడిన పోలీసులు.. అప్పటి నుంచి ఫ్రెండ్లీ పోలీసులా ప్రవర్తించారు. ఆ ట్రైనీ ఐపీఎస్ అధికారి జగదీష్ జరిగిన ఘటనపై.. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ కు లేఖ రాశారు. పోలిస్ స్టేషన్ లోని సిబ్బంది విధులు సరిగా నిర్వర్తించకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరించారని లేఖలో పేర్కోన్నారు.

దీంతో ట్రైనీ ఐపీఎస్ జగదీశ్.. స్టేషన్ లో పోలీసు సిబ్బంది.. తన ఎంట్రీ నుంచి ఐడెంటిటీ రివీల్ చేసే వరకు అక్కడి వారు వ్యవహరించిన తీరు.. తనపై పరుష పదజాలంతో మాట్లాడిన మాటలు మొత్తం వివరిస్తూ... ఎస్పీకి వివరణాత్మక లేఖ రాశారు. ఆయన వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు. ఎన్నిసార్లు అడిగినా ఎఫ్ఐఆర్ రాయకుండా.. పిర్యాదుదారుడికి ఎఫ్ఐఆర్ కాఫీని ఇవ్వకుండా పరుషపదజాలంతో వ్యవహరించిన రైటర్ ను తక్షణం విధుల నుంచి సస్పెండ్ చేశారు. కాగా, విధులు సక్రమంగా వ్యవహరించని ఇతర పోలీసులపై కూడా క్రమశిక్షణా రాహిత్యం కింద చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles